మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం కరోనా భారీన పడి మృతి చెందినట్టు ఈరోజు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. నేటి యువతకు దావూద్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ రెండు దశాబ్దాల క్రితం దావూద్ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కాదు. 1955 సంవత్సరం డిసెంబరు 27న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. దావూద్ తండ్రి పోలీస్ కానిస్టేబుల్.
1974 సంవత్సరం ముంబైలోని డోంగ్రీలో సృష్టించిన సంచలనం ద్వారా దావూద్ నేర చరిత్ర ప్రారంభమైంది. ముంబై లో డాన్ గా ఉన్న పఠాన్ బాషు దాదా మీద దావూద్ సోడా సీసాలతో దాడి చేశాడు. అనంతరం ముంబైలోని ఇతర డాన్ లను పక్కకు నెట్టేసి ముంబై మాఫియా కార్యకలాపాలను అంతర్జాతీయ నేరాల స్థాయికి దావూద్ తీసుకెళ్లాడు. ‘డి కంపెనీ’ పేరుతో దావూద్ చేసిన నేరాలు అన్నీఇన్నీ కావు.
దావూద్ డి కంపెనీ పేరుతో ఆయుధాల రవాణా, హవాలా, దొంగనోట్లు, మత్తు పదార్థాల రవాణా, బెదిరించి డబ్బు వసూలు చేయడం, కాంట్రాక్ట్ హత్యలు చేశాడు. బాలీవుడ్ సినీ ప్రముఖులతో సంబంధాలు ఏర్పరచుకుని కొన్ని సినిమాలకు పెట్టుబడులు కూడా పెట్టాడు. అయోధ్య ఘటనలకు ప్రతీకారంగా 1993 సంవత్సరంలో ముంబై నగరంలో పేలుళ్లు జరిగాయి. దావూద్ ముఖ్య అనుచరుడు టైగర్ మెమన్ పేలుళ్లలో కీలక పాత్రధారి.
ఆ పేలుళ్ల సమయం జరిగినప్పటి నుంచి మాయమైన దావూద్ అనంతరం భారత్ కు రాలేదు. భారత్ ను వదిలి దావూద్ పాక్ వెళ్లిపోయాడు. అల్ కాయిదా, లష్కరే తాయిబా వంటి మత ఛాందస సంస్థలతో దావూద్ సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఒసామా బిన్ లాడెన్‌తో దావూద్‌కు సాన్నిహిత్యం ఉందని అమెరికా గతంలో తెలిపింది. దావూద్ భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడికి పాకిస్తాన్ పాస్‌పోర్టులు ఉన్నాయి. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోనూ డి కంపెనీ పాత్ర ఉంది.
#BreakingNews | dawood ibrahim dies of COVID-19 in Karachi: Sources pic.twitter.com/BQUZtjEIZ3
— NewsX (@NewsX) June 6, 2020