ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరీక్షలను చాలా వేగంగా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంకా చెప్పాలంటే మ‌న దేశంలోనే అతి త‌క్కువ టైంలో ఎక్కువ క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింద‌నే చెప్పాలి. ఇక రోజు రోజుకు కేసులు పెరుగుతూ వస్తున్నాయి... కరోనా పరీక్షలను పరిస్థితులకు తగిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచుతూ పోతుంది. వేలల్లో పరీక్షలు నిర్వహిస్తుంది ప్రతీ రోజు.  ఈ నేపధ్యంలో తెలంగాణా, మహారాష్ట్ర వైద్య అధికారులు రెండు మూడు రోజుల్లో ఏపీ పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం.

 

ఏపీలో మాత్రమే ఈ స్థాయిలో కరోనా పరీక్షలను చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఏపీ  అధికారుల ద్వారా కరోనా పరిక్షలకు సంబంధించి సహాయం తీసుకోవాలని, కరోనా టెస్ట్ లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సహాయం తీసుకుని ముందుకు వెళ్ళాలి అని రెండు రాష్ట్రాలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక కిట్స్ కూడా ఏపీ నుంచి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఏపీలో ఇప్ప‌టికే ల‌క్ష‌ల్లో కిట్లు ఉన్నాయి.

 

ఇప్పుడు తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి పరీక్షలను చాలా వేగంగా చెయ్యాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఏపీ సర్కార్ సహకారంతో పరీక్షలను వేగంగా చెయ్యాలి అని భావిస్తున్నారు. ఇక్కడికి వచ్చి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం అయి ఆ తర్వాత సంబంధిత శాఖా మంత్రితో కూడా సమావేశం అయి ఒక కీలక బృందాన్ని మహారాష్ట్ర తీసుకుని వెళ్ళే ఆలోచనాలో మహారాష్ట్ర అధికారులు ఉన్నారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: