కర్ణాటక ఆరోగ్య శాఖ తాజాగా రాష్ట్రంలోని కోవిడ్ 19 కేసుల సంఖ్య ను ట్విట్టర్ ద్వారా మీడియాకు బులిటెన్ విడుదల చేశారు. ఇకపోతే ఇందులో నేటి వరకు మొత్తం 5760 కేసులు నమోదయ్యాయని అందులో తెలిపారు. గత 24 గంటల్లో ఏకంగా 308 కొత్త కేసులు కర్ణాటక రాష్ట్రం మొత్తం నమోదయ్యాయని తెలుస్తోంది. అలాగే రాష్ట్రం మొత్తం మీద 64 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇకపోతే రాష్ట్రం మొత్తంమీద 2519 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయి వారి ఇళ్లకు చేరారు. ఇక గత 24 గంటల్లో 387 మంది డిశ్చార్జ్ అవ్వగా 308 మంది కొత్త పేషెంట్లు కొత్త కేసులు వచ్చాయని తెలిపారు.
Covid19 Bulletin: 8th june 2020
— cm of karnataka (@CMofKarnataka) June 8, 2020
Total Confirmed Cases: 5760
Deceased: 64
Recovered: 2519
New Cases: 308
Other information: Telemedicine facility, Instructions to Tablighi Jamaat Attendees, Corona watch application and Helpline details.1/2 pic.twitter.com/mOt4DHtG2h
అంతేకాకుండా రాష్ట్ర మొత్తం మీద 3175 యాక్టివ్ కేసులు ఉన్నట్లు బులిటెన్ తెలుపుతోంది. ఇక ఈ రోజు రాష్ట్రం మొత్తంగా ముగ్గురు చనిపోయారు. దీనితో కర్ణాటక రాష్ట్రంలో నేటి వరకు మొత్తం 64 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసులలో 14 మందిని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రెండు వందల 277 మందికి కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మొన్నటి వరకు చాలా తక్కువగా ఉన్న కేసులు గత పది రోజుల నుంచి కర్ణాటక రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్నాయి.