దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తున్న ఈ వైరస్ భారీన పడి లక్షల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. వైరస్ ను ఎలా కట్టడి చేయాలో అర్థం కాక పలు దేశాలు లాక్ డౌన్ పైనే ఆధారపడ్డాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు వైరస్ ను కట్టడి చేయడం సాధ్యం కాదని పలు దేశాలు భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో న్యూజిలాండ్ కరోనాను నియంత్రించి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. 
 
ఈ విషయంలో న్యూజిలాండ్ ను తప్పనిసరిగా మెచ్చుకోవాలి. నిన్న న్యూజిలాండ్ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ తాత్కాలికంగా న్యూజిలాండ్ కరోనా మహమ్మారిని అరికట్టడంలో సక్సెస్ అయిందని ప్రకటన చేశారు. చిట్టచివరి కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన వ్యక్తికూడా కోలుకున్నట్టు నిన్న ఆ దేశపు వైద్య అధికారులు ప్రకటించారు. చైనాలో కరోనా కట్టడి అయినట్లు అనిపించినా తాజాగా ఆ దేశంలో వైరస్ విజృంభిస్తోంది. 
 
న్యూజిలాండ్ లో 1154 కరోనా కేసులు నమోదు కాగా 22 మంది చనిపోయారు. గత 14 రోజులుగా న్యూజిలాండ్ లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు నమోదు కానంత మాత్రాన వైరస్ పూర్తిగా అంతమైందని ఎవరూ భావించవద్దని ప్రధాని ప్రకటన చేశారు. న్యూజిలాండ్ లో మార్చి 25 నుంచి లాక్ డౌన్ ను అమలు చేశారు. 
 
నాలుగంచెల పద్దతిని న్యూజిలాండ్ ఫాలో అయింది. ఏప్రిల్ నెల వరకు వ్యాపారాలు, పాఠశాలలు అన్నీ మూసివేశారు. రెండవ దశలో ప్రజలు షాపులకు వెళ్లేలా అనుమతులు ఇచ్చారు. రెస్టారెంట్లు టేక్ అవేకు అనుమతిచ్చారు. మే 22 తర్వాత 17 రోజులుగా కొత్త కేసులు లేకపోవడంతో అక్కడ లాక్ డౌన్ ను ఎత్తేశారు. ప్రజలు మాస్క్ లు ధరించడం, భౌతికదూరం పాటించడంతో అక్కడ కరోనా తగ్గుముఖం పట్టింది. అయితే మన దేశంలో లాక్ డౌన్ సడలింపులు ఇచ్ఛిన తరువాత కొందరు నిబంధనలు పాటించకపోవడం వల్ల కేసులు నమోదవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: