దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ తో పాటు చైనా భారత్ సరిహద్దు వివాదం గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. చైనా భారత్ లోని ప్రాంతాలపై గుత్తాధిపత్యం ప్రదర్శించాలని ప్రయత్నిస్తోంది. ప్రపంచ దేశాల విషయంలో కూడా సామ్రాజ్యవాద ధోరణిని చైనా అవలంబిస్తోంది. కరోనా విజృంభణ వల్ల ప్రపంచ దేశాలు మొత్తం చైనా దేశంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలను డైవర్ట్ చేయడానికి చైనా సరిహద్దు వివాదం తెరపైకి తెచ్చిందని ప్రచారం జరుగుతోంది.
చైనా ఇప్పుడే ఈ సరిహద్దు వివాదానికి నాంది పలకడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం చైనా దేశంలో యువ జనాభా తగ్గిపోతోంది. వన్ ఆర్ నన్(ఒక బిడ్డను మించి కనకూడదు) అనే ఆదేశాలను అమలు చేసిన తరువాత ఆ దేశంలోని లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం వచ్చింది. మగపిల్లల సంఖ్య బాగా పెరిగిపోగా ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గిపోయింది.
చైనా చేసిన తప్పు అర్థం కావడంతో 2015లో ఇద్దరు పిల్లలను కనే అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినా స్త్రీ పురుషుల నిష్పత్తి వ్యత్యాసంలో పెద్దగా మార్పులు రాలేదు. సొంత ఇల్లు, విదేశీ చదువులు చదివిన వారిపైనే ఆ దేశపు యువతులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతొ అక్కడ పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోతుంది. పెళ్లి కాని యువకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. యువతులు కూడా ఒకరిని కనడానికే ఆసక్తి చూపిస్తున్నారు.
అక్కడి యువకులు కూడా ఇల్లు, విదేశీ చదువులపై ఆసక్తి చూపుతున్నారు. మరికొన్ని సంవత్సరాల్లో చైనాలో యువ జనాభా భారీగా తగ్గనుంది. ఆ సమయంలో యువ పురుషుల నిష్పత్తి కూడా భారీగా తగ్గనుంది. యుద్ధాలు చేసి ఇతర దేశాలను ఆక్రమించుకోవడం కష్టం. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో చైనా ఇతర దేశాలతో వివాదాలకు ప్రాధాన్యత ఇస్తోందని తెలుస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చైనా ఈ విధంగా ప్రవర్తిస్తోందని ప్రచారం జరుగుతోంది.