పెన్షన్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ ఓ సూచన ఇవ్వడం జరిగింది. పెన్షన్ ఖాతాదారులు తమ లైఫ్ సర్టిఫికెట్ ను అందజేయడంలో పడుతున్న ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరో వెసులుబాటు కల్పించడం జరిగింది.
అలాగే కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా వీటిని సులువుగా అందరి ఇవ్వచ్చు అంటూ ఖాతాదారులకు తెలియజేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకుని ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ దారుల కోసం తీసుకోవడం జరిగింది అంటూ ఈపీఎఫ్వో తెలియజేసింది.
ప్రతి సంవత్సరం పెన్షన్ ఖాతాదారులు లైఫ్ సర్టిఫికెట్ నోట్ డిసెంబర్ నెలలో అందజేయాల్సి ఉంటుంది. ఒక వేళా ఇవ్వలేకపోతే పెన్షన్లు అందకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న 3.65 లక్షల సిఎస్సి లోను డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అందజేసేందుకు వీలుంటుందని కార్మిక శాఖ తెలియజేయడం జరిగింది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న 135 ప్రాంతీయ కార్యాలయాలు, 117 జిల్లా కార్యాలయాలకు ఇవి అదనం అని అధికారులు తెలియజేశారు.
అంతేకాకుండా పింఛన్ దారుల వారికి వీలున్న సమయంలోనే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను సిఎస్ లో అందరూ నమోదు చేయవచ్చు అని తెలియజేసింది. అంతేకాకుండా మీరు అందజేసిన రోజు నుంచి సంవత్సరం రోజుల పాటు ఆ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుంది అంటూ ఈపీఎఫ్వో అధికారులు తెలియజేశారు.