కరోనా మహమ్మారి కారణముగా దేశం మొత్తం అతలాకుతలం అయిపొయింది. కరోనా వ్యాప్తి తగ్గించే దిశగా మన దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మన దేశంలో లాక్‌డౌన్ అంక్షలు సడలించడంతో మరోసారి కరోనా మహమ్మారి విజృంభణ పెరిగింది.అందుకే కొన్ని రాష్ట్రాలు మరోసారి ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు అయితే పూర్తిగా లాక్ డౌన్ వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే పంజాబ్‌లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువకావడంతో వారాంతాలు, పబ్లిక్ హాలీడేస్‌లో లాక్‌డౌన్ కఠినంగా అమలుచేయాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గురువారం ఆదేశించారు. కేవలం ఈ-పాస్‌లు ఉన్నవారికి అనుమతించాలని స్పష్టం చేశారు. ఈ పాస్ లేకుండా అనుమంతిచవద్దు అని ప్రకటించారు. పారిశ్రామిక రంగంలో మాత్రం సాధారణ కార్యకలాపాలకు అనుమతులు కొనసాగుతాయని తెలిపారు.అయితే ఢిల్లీలో పరిస్థితి చూస్తే ఢిల్లీ నుంచి పంజాబ్‌కు వచ్చేవారికి కరోనా నిర్ధారణ పరీక్షలు సహా కఠినమైన ఆంక్షలు విధించడాన్ని పరిశీలించాలని వైద్య నిపుణులను అమరీందర్ సింగ్ కోరారు.
చెన్నైలో కరోనా మహమ్మారి కోరలు విసురుతుండడంతో నగరంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఎందుకు విధించడం లేదని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు గురువారం ప్రశ్నించింది. శుక్రవారంలోగా దీనిపై స్పందన తెలియజేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. తమిళనాడులోని మొత్తం కేసుల్లో సగానికి సగం చెన్నైలోనే నమోదు కావడం గమనార్హం. గురువారం నాటికి అక్కడ 258 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారంటే ఒక్కసారి అక్కడ పరిస్థితి తీవ్రత గూర్చి ఆలోచించండి.
జార్ఖండ్ లో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలుచేయాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌ను మిత్రపక్షం కాంగ్రెస్ కోరింది. అటు, కేరళ సైతం కఠినమైన ఆంక్షలు విధించాలని నిర్ణియించుకున్నట్లు తెలుస్తుంది.అయితే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గించే అందుకు మళ్ళీ అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ దిశాగా అడుగులు వేస్తున్నాయని అర్ధం అవుతుంది.