ప్రపంచ వ్యాప్తం గా ఉన్న ప్రజలను మృత్యువు ఒడి లోకి నెట్టిన కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజు కు పెరుగుతూ వస్తుంది. ఈ కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వెళ్లనివ్వకుండా ఇళ్లకే పరిమితమయ్యే లా చేసింది. అంతే కాదు జనాల మధ్య దూరం పాటించాలని సూచించారు.దీంతో స్వచ్చందంగా అన్నీ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు మూత పడ్డాయి..

 

 

 

కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టే దిశ గా ప్రభుత్వాలు సాగుతున్నాయి. సినీ ప్రముఖులు ప్రజలకు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.చాలా మంది ప్రముఖులు ప్రజలకు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి పేదలకు స్వయంగా నో లేదా విరాళాలను అందించో ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్నారు. కరోనా ప్రభావం కొంత వరకు తగ్గు ముఖం పట్టడం తో యదావిధిగా అన్నీ పనులను చేసుకోవచ్చునని పర్మిషన్ ఇచ్చింది.

 

 

 


అసలు విషయాని కొస్తే.. కర్నూలు జిల్లా పత్తికొండ మర్రిమాను తండాకు చెందిన యువకుడు హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. కరోనా పరీక్షల కోసం శాంపిళ్లు ఇచ్చి ఫలితం రాకముందే గ్రామానికి చేరుకుని ఈ నెల 10న ఎల్. తండాకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అదే రోజు రాత్రి ఎల్.తండాలో ఏర్పాటు చేసిన విందులో వరుడు అస్వస్థతకు గరయ్యాడు. అదే సమయం లో అతడు కరోనా బారిన పడినట్టు ఫలితం వచ్చింది. దీంతో అప్రమత్త మైన అధికారులు వరుడిని ఐసోలేషన్‌కు, వధువును క్వారంటైన్‌కు తరలించారు. వివాహ వేడుకల్లో పాల్గొన్న వారు, అతనిని కలసిన వారు మొత్తం 70 కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తుల నమూనాలను సేకరించి వారిని కూడా క్వారంటైన్‌కు తరలించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: