అమ్మాయిలు ఐదు నిమిషాలు నగ్నంగా ఉండాలంటేనే సిగ్గుపడతారు. బాత్రూమ్‌లోనే.. డ్రస్సింగ్‌ రూమ్‌ లోనో, బెడ్ రూమ్‌లోనే కాసేపు నగ్నంగా ఉండటానికే మహా ఇబ్బంది పడతారు. అలాంటిది.. ఏకంగా ఐదు రోజుల పాటు ఒంటిపై నూలు పోగు లేకుండా ఉండటమంటే మాటలా.. అందులోనూ ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా ఊరు ఊరంతా అలా నగ్నంగా ఉంటారట.

 

 

ఇదేదో మహా వింతలా ఉందే అనుకుంటున్నారా.. అవును మరి. కొన్ని చోట్ల అలవాట్లూ, ఆహార పద్ధతులూ, నమ్మకాలు ఇలా విచిత్రంగానే ఉంటాయి మరి. అలాంటి ఓ వింత ఆచారమే హిమాచల్‌ప్రదేశ్‌లోని పిని గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో మహిళలు ఏడాదిలో ఐదు రోజులపాటు పూర్తిగా బట్టలు వేసుకోరు. అంతే కాదు.. ఆ ఐదు రోజులు భర్తలకు దూరంగా ఉంటారు.

 

 

ఒంటిపై బట్టలు లేకుండానే ఇంటి పనులన్నీ చేసుకుంటారు. ఇదంతా ఎప్పుడంటే.. ఆగస్టు నెల్లో వచ్చే ఓ పండగ సందర్భంగా పిని గ్రామ ప్రజలు ఆ విధంగా ఆచారాన్ని నిష్ఠగా పాటిస్తుంటారట. ఎందుకు అలా అంటే.. అలా చేయకపోతే అరిష్టమనీ కీడు జరుగుతుందనేది వారి విశ్వాసం. ఇందుకు వారు ఓ పురాణ గాధను కూడా చెబుతారు. ఓ రాక్షసి పీడ నుంచి గ్రామం విముక్తమైనందుకు గుర్తుగా ఈ పండుగ చేసుకుంటారట.

 

 

అయితే ఈ పండుగ రోజుల్లో మగాళ్లకూ కొన్ని కండీషన్లు ఉంటాయి. అవేటంటే.. ఆ ఐదు రోజులు మగాళ్లు కూడా మందు, మాంసం జోలికి వెళ్ల కూడదు. పండుగ ఐదు రోజులూ పూర్తయ్యే వరకూ పరమ నిష్ఠగా ఉండాలి. ఇదుగో మళ్లీ ఆగస్టు వచ్చేస్తోందిగా.. పండుగ కోసం పినీ వాసులు రెడీ అవుతున్నారు. అన్నట్టు ఈ ఐదు రోజులూ ఈ ఊళ్లోకి ఇతరులను అస్సలు రానివ్వరట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: