గత 40 రోజులుగా భారత్ చైనా సరిహద్దు వివాదం గురించి చర్చ జరుగుతోంది. చైనా సరిహద్దు దగ్గర సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండటంతో భారత్ కూడా ధీటుగా సమాధానమిస్తోంది. తాజాగా తూర్పు లడఖ్ వివాదంపై భారత్, చైనా దేశాల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయని తెలుస్తోంది. సైనిక దళాల అధిపతి జనరల్‌ ఎంఎం నరవణే నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది 
 
గాల్వాన్‌ లోయ నుంచి ఉభయ దేశాలు తమ బలగాలను దశలవారీగా ఉపసంహరించుకుంటున్నాయని సమాచారం అందుతోంది. భారత ఆర్మీ చీఫ్‌ లడఖ్ నుంచి సేనల ఉపసంహరణ గురించి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి. వాస్తవాధీన రేఖ గుండా మొత్తం పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు చైనాకు భారత్ భారీ షాక్ ఇచ్చిందని కూడా తెలుస్తోంది. 
 
చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించిన సమయంలో కూడా భారత్ ఎయిర్ స్ట్రిప్ నిర్మాణం చేసి... సరిహద్దుల్లో ఏ నిర్మాణాలనైతే ఆపాలని చైనా ప్రయత్నించిందో ఆ నిర్మాణాలనే భారత్ ఆగకుండా చేసింది. దీంతో చైనా సైన్యం వెనక్కు తగ్గక తప్పలేదు. సరిహద్దుల్లోని ప్రాంతాలు మావి అని చెబుతున్న చైనాకు అక్కడే నిర్మాణాలు చేపట్టి భారత్ భారీ షాకులు ఇస్తోంది. భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న మున్సియారీ బుగ్ధియారు - మిలన్ రహదారి నిర్మాణం కోసం భారత్ హెలికాఫ్టర్ల సహాయంతో నిర్మాణయంత్రాలను దింపబోతుందని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం 65 కిలోమీటర్ల రహదారిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. భారత్ చైనా సరిహద్దు అంచుదాకా వెళ్లేలా రోడ్లు ఏర్పాటు చేసింది. ఈ రోడ్ల నిర్మాణం జరగకూడదనే చైనా ఇంతకాలం ప్రయత్నించింది. కానీ అంతిమంగా భారత్ చైనాకు షాక్ ఇస్తూ రోడ్ల నిర్మాణం చేపడుతోంది. చైనాలోని ఒక వర్గం సైన్యం కూడా భారత్ రోడ్ల నిర్మాణం చేపట్టడంపై పాలకులపై ఒత్తిడి తెచ్చి సరిహద్దు దగ్గర వివాదానికి కారణమైందనే ప్రచారం కూడా జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: