కర్ణాటక రాష్ట్రంలో రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా నమోదు అవుతున్నాయి. తాజాగా కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది. గడిచిన 24 గంటలలో రాష్ట్రంలో 176 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బులిటెన్ లో తెలియజేయడం జరిగింది. దీనితో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 7000 లకు చేరుకుంది. ఇక గడిచిన 24 గంటలలో 312 మంది కరోనా వైరస్ కు జయించి పూర్తి ఆరోగ్యంతో కోలుకొని వారి ఇంటికి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.
Covid19 Bulletin: 14th june 2020
— cm of karnataka (@CMofKarnataka) June 14, 2020
Total Confirmed Cases: 7000
Deceased: 86
Recovered: 3955
New Cases: 176
Other information: Telemedicine facility, Instructions to Tablighi Jamaat Attendees,Corona watch application and Helpline details.
For more details- https://t.co/CDyg98yWTm pic.twitter.com/XUaKd6iZto
గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో మొత్తం 5 మంది కరోనా వైరస్ బారినపడి మృతి చెందడం జరిగింది. దీనితో ఇప్పటి వరకు రాష్ట్రంలో 86 మంది కరోనా వైరస్ బారినపడి మృత్యువాత పడ్డారు. ఇక 16 మందికి ఆరోగ్యం కాస్త సీరియస్ గా ఉండడంతో icu లో అడ్మిట్ చేసి వైద్య అధికారులు వారికి చికిత్స అందచేస్తున్నారు. ఇక నేడు విదేశాల నుంచి వచ్చిన వారిలో 6 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 88 మందికి కరోనా పాజిటివ్ గా డాక్టర్లు నిర్ధారణ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2956 కరోనా పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి అన్ని బులిటెన్ లో తెలియజేశారు.