లాక్‌డౌన్ నిబంధనల సడలింపుతో తెరుచుకున్న ఆలయాలు మళ్లీ కరోనాతో మూతబడుతున్నాయ్. శ్రీకాళహస్తి, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయాలను ఇప్పటికే మూసివేయగా.. తాజాగా సిబ్బందికి కరోనా సోకడంతో కాణిపాకం వినాయకుడి ఆలయాన్ని కూడా మూసివేశారు.
చిత్తూరు జిల్లాలోని ఆలయాలకు కరోనా గ్రహణం పట్టింది. వరుసగా ఆలయాల్లోని పనిచేస్తున్న సిబ్బంది కరోనా వైరస్ సోకడంతో శ్రీకాళహస్తి, తిరుపతి గోవిందరాజస్వామి, కాణిపాకం ఆలయాలను మూసివేశారు అధికారులు. గ్రహణ సమయాల్లో దేశమంతా ఆలయాలు మూతపడ్డా... చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. అటువంటి శ్రీకాళహస్తి ఆలయంలోకి మాత్రం భక్తులకు ఇంకా నో ఎంట్రీ. అధికారులు ఆలయాన్ని తెరుస్తామని ప్రకటించిన కోద్ది సేపటికే ఆలయంలో పనిచేసే ఓ కాంట్రాక్టు అర్చకుడికి కరోనా పాజిటివ్ రావడంతో ముక్కంటి ఆలయంలోకి భక్తులను అనుమతించబోవడం లేదని ప్రకటించారు అధికారులు.
టీటీడీ అనుబంధ ఆలయంలో తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలోనూ కరోనా కలకలం రేపుతోంది. 8వ తేదీ నుంచి ఆలయాలు తెరవగా.. అధికారుల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో అంతా సవ్యంగా సాగుతోంది. ఈ క్రమంలో ఆలయంలో పనిచేస్తున్న ఓ శానిటరీ ఇన్పెక్టర్ కి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అనుమానంతో కరోనా టెస్టులు చేస్తే పాజిటివ్ గా తేలిసింది. దీంతో ఓక్కసారి ఉలిక్కిపడింది టీటీడీ. అ ఉద్యోగి ఎక్కడెక్కడ తిరిగాడు, ఎక్కడ విధులు నిర్వహించారు. ఎవరి ఎవరిని కలిశారో అని టెన్షన్ నెలకొంది. దీంతో గోవిందా రాజస్వామీ ఆలయాన్న రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. ఆలయంలో పనిచేస్తున్న 150మందికి కరోనా టెస్టులు నిర్వహించారు అధికారులు.
రెండు ఆలయాలను మూసివేసిన రెండు రోజులకే ఆ లిస్టులోకి వరసిద్ది వినాయక స్వామీ ఆలయం చేరింది. ఆలయంలోనే పనిచేసే ఓ హోం గార్డుకు కరోనా పాజిటివ్ రావడంతో.. ఆలయాన్ని మూసివేయాలని అదేశించారు అధికారులు. ఆలయంలో పనిచేసే ఈవో నుంచి సిబ్బంది వరకు అందరూ హోం క్యాంటైన్‌లో ఉండాలని సూచించారు అధికారులు. దీంతో కాణిపాకం ఆలయం సైతం మరో వారం రోజులు మూసివేస్తున్నట్లు తెలిపారు ఆలయ ఈవో.
ఇలా వారం రోజులు వ్యవధిలో మూడు ప్రముఖ ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా సోకడంతో ఆలయాన్ని మూసివేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. మరోవైపు ఇటువంటి వార్తల నేపధ్యంలో కాణిపాకం ఆలయంలోని ఉద్యోగులకు కరోనా పరిక్షలు చేయించారు. ఇతర ఆలయాల్లో ఖచ్చితంగా ఉద్యోగులు టెస్టులు చేసుకోవాలని సూచిస్తున్నారు.