
మన భారత దేశంలో ఉన్నవారు.. లేని వారు ఉన్నారు. వాటి తో పాటుగానే ఎన్నో కట్టుబాట్లు, సాంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆయా కట్టుబాట్లు చూస్తుంటే ఆశ్చర్యం కాదు.. గుండెల్లో వణుకు పుట్టుకు వస్తుంది. అయితే కరోనా సమయంలో ఈ మద్య అందరూ శాంతి మంత్రం జపించారని అంటున్నారు.. భారత దేశం మొత్తం ఏకతాటిపై నడిచిందని అంటున్నారు. కష్టం వస్తే సాటి మనిషిని ఆదుకుంటున్నారని అంటున్నారు.. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం తప్పు చేస్తే భయంకరమైన శిక్షలు విధిస్తున్నారు. తాజాగా ఓ మహిళను ప్రేమించాడని యువకుడిపై కుల పెద్దలు దారుణంగా వ్యవహరించారు. విచక్షణ రహితంగా బూట్లతో కొడుతూ.. మూత్రం తాగించారు.
ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని శిరోహిలో ఇటీవల చోటు చేసుకుంది. కాకపోతే ఈ విషయం మాత్రం చాలా ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. ఓ యువకుడు తన కులం మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. కొంత కాలం వీరి వ్యవహారం గుట్టుగానే సాగింది.. ఈ మద్య ఓ సందర్భంలో ఇంటి పెద్దలకు తెలియడంతో ఆ గొడవ కాస్త పంచాయితీ పెద్దల వద్దకు వెళ్లింది.
ఇక ఆ యువకుడికి చుక్కలు చూపించారు పంచాయితీ పెద్దలు. యువకుడిపై పంచాయతీ పెద్దలు దారుణంగా కొట్టారు. రోడ్డుపై ఈడ్చుకెళ్తూ.. షూతో చితక బాధారు. ఆ తర్వాత ఓ సీసాలో మూత్రం తీసుకువచ్చి బలవంతంగా తాగించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి కొంత మందిని అరెస్టుగా చేయగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Video of a man forced to drink urine goes viral. He is also being beaten up by several people. language and clothes indicate it is from Sirohi district and Rebari community. @fpjindia @PoliceRajasthan#Rajasthan #Atrocity pic.twitter.com/cFwWUbfJNd
— Dr Sangeeta Pranvendra (@sangpran) June 16, 2020