
బిడ్డకి జన్మనిస్తున్న అంటే ఏ మహిళ అయినా ఉప్పొంగిపోతుంది. ఆ తల్లి ఆనందానికి అవధులు ఉండవు. కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసి బిడ్డకి పెరుగుదలకు కావలిసిన పోషకపదార్ధాలు తీసుకుంటుంది. ఎన్నో జాగ్రత్తలు కూడా పాటిస్తుంది. కాని అమ్మ అవుతున్న అన్న విషయం కూడా ఒక మహిళ కు తెలియకుండానే ఒక ఓ పండంటి ఆడ పిల్లకి జన్మనిచ్చింది. అసలు బిడ్డను కనే వరకు ఆ మహిళ తాను గర్భిణి కాదనుకున్నది. తనకు బిడ్డ పుట్టడంతో ఆమె ఆశ్చర్యానికి గురైంది. భర్త కూడా షాకయ్యాడు. వినడానికి మీకు కొత్తగా ఉన్న కానీ ఇది నిజం.
వివరాలలోకి వెళితే... ఇంగ్లండ్ లోని లిటిల్ హాంప్టన్ కు చెందిన జేమ్స్ మియాచిమ్(34), గ్రేస్ మియాచిమ్(32) దంపతులకు ఇప్పటికే ముగ్గురు సంతానం. ఇద్దరు మగ పిల్లలు కాగా, ఒకరు అమ్మాయి. ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉండడంతో ఆ దంపతులు నాలుగో సంతానం గూర్చి ఎటువంటి ప్లాన్ చేసుకోలేదు. కానీ, గ్రేస్ కి ఇప్పటిదాకా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ జరగలేదు. అందుకనే గ్రేస్ గర్భనిరోధక మాత్రలు వాడుతుందట. రెగ్యులర్ గానే పీరియడ్స్ వస్తున్నాయి. ఓసారి ఆమెకు కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్లు ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్టులు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. మళ్లీ ఐదు నెలల తర్వాత నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లింది. అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ పరీక్షలు చేశారు. ఫలితం మాత్రం నెగిటివే. అల్ట్రా సౌండ్ పరీక్షలు నిర్వహించగా కణితి ఉందని తేలింది. కానీ ఆమె అప్పటికే ఐదు నెలల గర్భిణి. అప్పటికి కూడా కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలుసుకోలేకపోయింది.
మొత్తానికి ఆమెకు కొద్ది రోజుల క్రితం కడుపులో తీవ్రమైన నొప్పి, అలసట వచ్చాయి. దీంతో పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంది. కొంచెం సేపటికి బాత్రూంకు వెళ్లగా.. ఏదో బయటకు వస్తున్నట్లు అనిపించింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆమె.. భర్తను పిలిచి అంబులెన్స్ కు కాల్ చేయమని చెప్పింది. కానీ అప్పటికే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను చూసి గ్రేస్ ఆశ్చర్యానికి గురైంది.. అసలు ఇది ఎలా సాధ్యం, రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి. గర్భనిరోధక మాత్రలు వేసుకుంటున్నాను. కానీ కడుపులో బిడ్డ పెరిగింది ఏంటని ఆమె షాక్ అయింది. భార్య తో పాటు భర్త కూడా షాక్ కి గురయ్యాడు. తన నాలుగో సంతానాన్ని చూసి దంపతులిద్దరూ మురిసిపోయారు.ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. బిడ్డను చూసి ఆనందంలో మునిగిపోయారు.