కరోనా కల్లోలం మొదలయ్యాక.. ప్రపంచమంతా శానిటైజర్ల పేరు మార్మోగిపోతోంది. మనషులకు ఇతర వస్తువులపై వ్యామోహం తగ్గిపోయి.. శానిటైజర్లపై మక్కువ పెరిగింది. ఇళ్లలో  వీలైనంత ఎక్కువ స్టాకు తెచ్చిపెట్టుకుంటున్నారు. దీంతో వీటికి డిమాండ్‌ అమాంతం పెరిగిపోయి తయారీ సంస్థలకు చేతినిండా పని దొరికింది.

 

కరోనా వైరస్‌... ప్రపంచాన్ని భయపెడుతున్న ఒకే ఒక్క మాట ఇది. మందులేని ఈ ప్రాణాంతక వైరస్‌ సృష్టిస్తున్న బీభత్సానికి అగ్రదేశాలు సైతం అల్లకల్లోలమవుతున్నాయి. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వ్యాక్సిన్‌ వచ్చేవరకు, దీని నియంత్రించాలంటే వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరమే మార్గమంటూ ఆరోగ్య నిపుణులు చెప్పడంతో ఆ దిశగా మనుషులు తమనుతాము మార్చేసుకుంటున్నారు. 

 

కరోనా దెబ్బకు.. శానిటైజర్లు, మాస్కులు, హ్యాండ్‌వాష్‌ లోషన్లు, టెంపరేచర్‌ గన్లకు.. ఎక్కడలేని గిరాకీ ఏర్పడింది. కొవిడ్‌-19కు ముందు వాటి అవసరం ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు మార్కెట్‌లో వాటికి డిమాండ్‌ పెరిగింది. ప్రధానంగా.. శానిటైజర్ల డిమాండ్ ఊహించని స్థాయికి చేరింది. దీంతో శానిటైజర్ల పేరిట.. వేలాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. కరోనా కష్ట కాలంలోనూ కొన్ని సంస్థలు అవకాశాలు అందిపుచ్చుకుంటూ లాభాలు గడిస్తున్న పరిస్థితి. 

 

నిజం చెప్పాలంటే, ఒకప్పుడు ఈ శానిటైజర్ల ఊసే లేదు. పెద్దగా పట్టించుకునే వాళ్లూ లేరు. కానీ ఇప్పుడు అవి లేని కార్యాలయం, ఇల్లు కనిపించడం లేదు. అందుకే మార్కెట్లో వాటికి డిమాండ్‌ ఏర్పడింది. చిన్న దుకాణాల నుంచి  షాపింగ్‌ మాళ్ల వరకు  వాటి గురించి ఆరాతీయని వినియోగదారులు లేరు. ఓ వైపు కరోనా కట్టడి.. మరోవైపు కార్యకలాపాలు సాగేలా పలు సంస్థలు రక్షణ చర్యలు తీసుకుంటుండటంతో శానిటైజర్ల డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. 

 

ప్రస్తుతం ఎటు చూసినా కరోనా కల్లోలం..  ఇంట్లో ఉండాలన్నా.. కార్యాలయాల్లో పనిచేయాలన్నా.. శానిటైజింగ్‌ తప్పనిసరైంది. దీంతో చాలా రకాల కంపెనీలు, సంస్థలు శానిటైజర్ల తయారీలో నిమగ్నమయ్యాయి. నిర్ణీత ధరను నిర్ణయించి..మార్కెట్లో వదులుతూ వేలకోట్ల రూపాయల వ్యాపారం నడిపిస్తున్నాయి. ఐటీ సహా ఇతర ఉద్యోగసంస్థల్లో.. ఉద్యోగుల భద్రత కోసం వీటి వినియోగం బాగా పెరిగింది. మెడికల్‌ స్టోర్స్‌, సూపర్‌ మార్కెట్లు తదితర షాపుల్లో వీటి విక్రయం ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగాచెప్పాల్సిన పనే లేదు.. ఆన్‌లైన్‌లోనూ శానిటైజర్ల కొనుగోళ్లు ఊహించని రేంజ్‌లో ఊపందుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: