లాక్ డౌన్ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఉజ్వల యోజన స్కీమ్ కింద ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారికి తీపికబురు అందబోతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీరికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 2020 జూలైలో ముగియనున్న ఈఎంఐ రెఫరెన్స్ స్కీమ్‌ గడువును మరో ఏడాది పాటు పొడిగించాలని ఆలోచిస్తున్నారు.

 

 

ఉజ్వల స్కీమ్ కింద ఎల్‌పీజీ సిలిండర్ కొనుగోలు చేసే వారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఈఎంఐ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. ఉజ్వల స్కీమ్ కస్టమర్లు గ్యాస్ స్టవ్, తొలి గ్యాస్ సిలిండర్ ధరను ఈఎంఐ రూపంలో చెల్లించొచ్చునన్నారు. దీనికి రూ.1600 ఖర్చవుతుందని దీన్ని ఈఎంఐ రూపంలో కట్టొచ్చునన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం వీరికి సిలిండర్ సెక్యూరిటీ డిపాజిట్ కోసం రూ.1600 ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు.

 

 

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉజ్వల స్కీమ్ కస్టమర్ల ఈఎంఐ డబ్బులను గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేస్తే వచ్చే సబ్సిడీ మొత్తం నుంచి కట్ చేసుకుంటాయన్నారు. ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు రూ.1600 ఈఎంఐ డబ్బులను కట్ చేసుకున్న తర్వాత సబ్సిడీ డబ్బులు మీకు వస్తాయన్నారు. అయితే ఇక్కడ ఈఎంఐ డబ్బులను 7వ సిలిండర్ బుకింగ్ నుంచి ఆయిల్ కంపెనీలు కట్ చేసుకుంటాయి. 14 కేజీల సిలిండర్‌కు ఇది వర్తిస్తుంది. అదే 5 కేజీల సిలిండర్ అయితే 18వ సిలిండర్ బుకింగ్ నుంచి ఈఎంఐ డబ్బులు కట్టాలన్నారు.

 

 

దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారు మాత్రమే ఉజ్వల స్కీమ్‌లో చేరడానికి అర్హత కలిగి ఉంటారన్నారు. బీపీఎల్ కార్డు లేదంటే బీపీఎల్ రేషన్ కార్డు ఉన్న వారు సులభంగా ఈ పథకంలో చేరొచ్చునన్నారు. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వంటి డాక్యుమెంట్లు కూడా అవసరం అవుతాయి. స్కీమ్‌లో చేరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందొచ్చున్నని ఈ సందర్బంగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: