
సోమవారం రాత్రి కల్నల్ సంతోష్ మరణం తరువాత ఏం జరిగిందనే ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది. ఆరోజు జరిగిన హింసాత్మక ఘర్షణల్లో భారత సైనికులు 20 మంది మృతి చెందారు. చైనా సైనికులు ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారో తెలియటం లేదు. గతంలో పాకిస్తాన్ కూడా బాలాకోట్ మీద దాడులు జరిగినపుడు మృతదేహాలను తీసుకెళ్లినట్లు సమాచారం అందింది. ప్రస్తుతం చైనా భారత్ సరిహద్దుల్లో ఏం జరిగిందనే అంశం గురించి వాస్తవాలు బయటకు వస్తున్నాయి.
మొదట అక్కడ చైనా సైనికులు శిబిరాన్ని తీసేస్తున్నామని చెప్పి ఆ శిబిరం వెనకాల దాక్కుని దాడి చేశారు. ఆ దాడిలో కల్నల్ సంతోష్ తో పాటు మన సైనికులు కొందరు చనిపోయారు. ఈ విషయంపై భారత సైనికులకు సమాచారం అందిన తరువాత మిగతా సైనికులు అక్కడికి చేరుకోవడంతో ఇరుదేశాల సైనికుల మధ్య తోపులాట జరిగింది. అయితే ఆ తరువాత సరిహద్దు ప్రాంతంలో సీరియస్ ఘటనలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.
ఎంతమంది చనిపోయారో చైనా సైనికులు లెక్క పెట్టడం కూడా కష్టమని సమాచారం అందుతోంది. 8 చైనా హెలికాఫ్టర్లు మృతదేహాల కోసం మూడు రౌండ్లు వేశాయని అక్కడి సైనికులు చెబుతున్నారు. సంతోష్ మృతి అనంతరం కొందరు భారత సైనికులు గాయాలు తగిలినా వీరోచితంగా పోరాడి చైనా సైన్యాన్ని మట్టుబెట్టారు. బీహార్ రెజ్మెంట్, మౌంటేన్ కాప్స్ విభాగం చేసిన అటాక్ వల్ల భారీగా చైనా సైనికులు చనిపోయారని సమాచారం అందుతోంది.
ఒక కిలోమీటర్ దూరం చైనా భూభాగంలోకి భారత్ సైనికులు దాడి చేశారని తెలుస్తోంది. బీహార్ సైనికులు చైనా సైనికులను వెంటాడి వేటాడారని 100కు పైగా సైనికులు చనిపోయి ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కల్నల్ సంతోష్ మృతితో రెచ్చిపోయిన భారత సైనికులు చైనా సైనికులపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. అక్కడ ఉన్న ఒక సరస్సులో 40 - 50 చైనా సైనికుల మృతదేహాలు ఉన్నాయంటే భారత సైనికులు ఏ విధంగా దాడి చేశారో సులభంగానే అర్థమవుతుంది.