ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను మృత్యువు ఒడిలోకి నెట్టిన కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజు కు పెరుగుతూ వస్తుంది. ఈ కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వెళ్లనివ్వకుండా ఇళ్లకే పరిమితమయ్యే లా చేసింది. అంతే కాదు జనాల మధ్య దూరం పాటించాలని సూచించారు.దీంతో స్వచ్చందంగా అన్నీ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు మూత పడ్డాయి..
కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా ప్రభుత్వాలు సాగుతున్నాయి. సినీ ప్రముఖులు ప్రజలకు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.చాలా మంది ప్రముఖులు ప్రజలకు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి పేదలకు స్వయంగానో లేదా విరాళాలను అందించో ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్నారు. కరోనా ప్రభావం కొంత వరకు తగ్గు ముఖం పట్టడంతో యదావిధిగా అన్నీ పనులను చేసుకోవచ్చునని పర్మిషన్ ఇచ్చింది.
ఇంటింటికీ మద్యం ఉత్పత్తులను చేర్చేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, బిగ్ బాస్కెట్ లకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతించింది. ఇండియాలో ఓ రాష్ట్ర ప్రభుత్వం మద్యం హోమ్ డెలివరీకి అనుమతించడం ఇదే తొలిసారి. ఈ మేరకు వెస్ట్ బెంగాల్ స్టేట్ బీవరేజస్ కార్పొరేషన్ నుంచి అనుమతులు వచ్చాయని అమెజాన్ స్పష్టం చేసింది.
కాగా, ఇండియాలో అత్యధికంగా జనాభా ఉన్న 4వ రాష్ట్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్ లో దాదాపు 9 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. కాగా, కరోనా, లాక్ డౌన్ కారణంగా అన్ని రకాల వ్యాపారాలు నష్టపోయి, ప్రభుత్వ ఖజానా ఖాళీ కాగా, నిబంధనల సడలింపు అనంతరం కొత్త కేసులు పెరుగుతుండగా, మమతా బెనర్జీ సర్కారు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా అన్నీ రాష్ట్రాల్లో వస్తె బాగుండునని మద్యం ప్రియులు అభిప్రాయ పడుతున్నారు..