ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలక నాయకుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా, మంత్రిగా చేసిన ఆయన ప్రత్యర్థుల విమర్శలను తిప్పి కొట్టడంలోనూ, ఎత్తుకు పై ఎత్తులు వేయడం లోనూ దిట్ట. గత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోను మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాకుండా ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ధర్మాన ప్రసాదరావు వ్యవహరించారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ సొంత కుంపటి పెట్టుకున్నా, ఆయన కాంగ్రెస్ లోనే ఉండి పోయారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి  హయాంలోనూ మంత్రిగా ఉన్నారు. ఇక ఆ తర్వాత తలెత్తే పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీలోకి వెళ్లారు. 

IHG


ఇక ధర్మాన ప్రసాదరావు అన్న krishna DAS' target='_blank' title='ధర్మాన కృష్ణ దాస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధర్మాన కృష్ణ దాస్ వైసీపీలోనే ఉన్నారు. ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర వేయించుకున్నారు. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మంత్రి పదవిని జగన్ కట్టబెట్టాడు. అప్పటి వరకు ధర్మాన ప్రసాదరావుకి మంత్రి పదవి వస్తుందని అంతా భావించగా, జగన్ ఎవరూ ఊహించని విధంగా కృష్ణదాసు కి ఆ పదవిని కట్టబెట్టారు. ఇక అప్పటి నుంచి వైసిపి ప్రభుత్వంపై అసంతృప్తితోనే ఆయన ఉంటూ వస్తున్నారు. తెలుగు దేశం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న అచ్చెన్నాయుడు ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నా, ధర్మాన కృష్ణదాస్ ఆయన విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం కూడా చేయకపోవడం వంటి పరిణామాలు జగన్ కి అసహనం కలిగిస్తున్నాయి .


ఈ నేపథ్యంలో మంచి వాక్చాతుర్యం ఉన్న ధర్మాన ప్రసాదరావును మంత్రివర్గంలోకి తీసుకుంటే మంచిదనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కృష్ణదాస్ సైతం అంగీకరిస్తున్నారు. తన తమ్ముడు మంచి పాలనాదక్షుడు అని, ఆయనకు తొందరలోనే ఉన్నత పదవులు వస్తాయని, మీడియా ముఖంగానే చెబుతుండడంతో ప్రసాదరావు వర్గీయులు ఆనందం వెల్లివిరుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి మంత్రి కొడాలి నాని కూడా కృష్ణదాస్ కంటే ప్రసాదరావు కు ఇస్తేనే పార్టీకి మేలు జరుగుతుందనే  అభిప్రాయాన్ని జగన్ వద్ద వ్యక్తం చేయడంతో ఆయనకు మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తన తమ్ముడికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటే తాను  మంత్రి పదవిని త్యాగం చేసేందుకు కూడా సిద్ధమనే సంకేతాలను కృష్ణదాస్ ఇస్తున్నారట. ఈ విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: