ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతూ వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య మరీ దారుణంగా ఉంది. ఇప్పటికే ఏకంగా దేశంలో నాలుగు లక్షలు దాటిపోయింది కరోనా కేసుల సంఖ్య. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ మహమ్మారి వైరస్ మాత్రం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా లాక్ డౌన్ సడలింపు ఇచ్చినప్పటినుంచి ఈ మహమ్మారి వైరస్ ఉదృతి మరింత గా ఉన్న విషయం తెలిసిందే. ప్రతి రోజు ఏకంగా 14 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి భారతదేశంలో . ఈ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.
ఈ మహమ్మారి వైరస్ దారుణంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కరోనా వైరస్ పేషెంట్ లకు సేవలందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే వైద్య ఆరోగ్య సిబ్బంది తమకు ఇన్సూరెన్స్ పొడిగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య సిబ్బంది కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య సిబ్బంది ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ను మరో మూడు నెలల పాటు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.
దీంతో కరోనా వైరస్ తో ప్రత్యక్షంగా పోరాడుతున్న వైద్య ఆరోగ్య సిబ్బంది కి ఈ సెప్టెంబర్ నెల వరకు 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజి ఉంటుంది. దేశ వ్యాప్తంగా 22 లక్షల వైద్య ఆరోగ్య సిబ్బంది కి ఈ బీమా వర్తించనుంది. కాగా కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య సిబ్బంది కి అందిస్తున్న ఈ 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అందిస్తున్నారు.దేశంలో కరోనా వైరస్ మొదలైన గత మార్చి నుంచి ఈ భీమాను వైద్య ఆరోగ్య సిబ్బంది కి వర్తింప చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వైద్య ఆరోగ్య సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.