ఆ దేశ రాజు తన దేశానికి చెందిన నిధులను స్వప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ఉండడంతో దేశంలోని ప్రజలు ఆకలితో ఆహాకారాలు పడుతున్నారు. దీంతో ఆ దేశ ప్రజలు ఆ రాజు పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతే కాదు ఆ దేశ రాజు పై ప్రతిపక్ష నేతలు కూడా రాజుగా ఉన్న మస్వతి-III నీ బాగా తిట్టిపోస్తున్నారు. దేశంలో సుమారు 63 శాతం మంది ప్రజలు పేదరికంతో బాధపడుతూ ఉంటే వారికి అండగా ఉండాల్సిన ఆయనే ఇలా నిధులను దోచుకుంటే ఇలా అంటూ తీవ్రస్థాయిలో ఆ దేశ రాజు పై ప్రతిపక్ష పార్టీ యూనిటెడ్ డెమోక్రాటిక్ మూమెంట్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈయన గతంలో కూడా చాలా విలువైన రూల్స్ రాయల్స్ కార్లను కూడా కోట్ల రూపాయలు వెచ్చించి తన భార్యకు బహుమానంగా ఇచ్చాడని తెలుస్తోంది.

 


ఇవి చాలదన్నట్టు తాజాగా మరో 120 బీఎండబ్ల్యూ కార్స్ కు ఆర్డర్ ఇచ్చి ఆ దేశంలో సంచలనానికి తెర తీశాడు. ఈ 120 కోట్ల విలువ చేసే భారత కరెన్సీలో ఏకంగా 175 కోట్ల విలువ చేస్తుందని అర్థమవుతోంది. కాలా ఉంటే అతడికి ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్ పార్కింగ్ గ్యారేజీ ఉందంటే అతని దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన చేసిన పనులకు ఏదో రకంగా సమర్థత ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం చేసిన పనికి తాను మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకి రాజులు తప్పకుండా కొత్త కార్లను కొన్ని ఆచారం ఎప్పుడు నుంచో ఉందని ఆయన కూర్చున్నాడు.

 


అయితే 120 కార్లు ఓ లారీలో రాణుల వారి ఇంటికి డెలివరీ అవుతుండగా ఆ దేశంలోని జర్నలిస్టులు వాటి ఫోటోలు తీసి రాజు పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అయిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: