అసలే అధికార పార్టీ, పైగా దూకుడు మీద ఉన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో ఎన్నో అవినీతి, అక్రమాలకు కేంద్ర బిందువుగా ఉంది. ఆ పార్టీలో ఉన్న నాయకులకు ఇప్పుడు ఆ భయం కూడా ఎక్కువైంది. దీంతో పెద్ద ఎత్తున అధికార పార్టీ లోకి వచ్చి చేరిపోయారు. అలా చేరితే కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనేది వారి ఎత్తుగడ అయ్యి ఉండవచ్చు. ఆ ఉద్దేశంతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నుంచి నాయకులు క్యూ కట్టేశారు. వచ్చిన వారిని వచ్చినట్టు జగన్ చేర్చేసుకున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో మొదటి నుంచి జగన్ ని నమ్ముకుని ఉన్న నాయకులకు, కొత్తగా వచ్చిన నాయకులకు మధ్య సమన్వయం కొరవడి, గ్రూపు రాజకీయాలకు తెర లేచింది. తెలుగుదేశం పార్టీని బలహీనం చేయడమే లక్ష్యంగా జగన్ ఆ పార్టీ నాయకులు అందరిని, వచ్చిన వారిని వచ్చినట్టుగా పార్టీలో చేర్చుకుని వారి మెడలో వైసీపీ కండువా కప్పేస్తున్నారు.
కానీ అలా చేరిన వారికి ఎటువంటి హామీలు గాని, పదవులు కానీ ఇవ్వకపోవడంతో వారు ఇప్పుడు అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సిద్ధ రాఘవరావు కి వైసీపీ కండువా కప్పేశారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు అయితే ఇప్పుడు వైసిపిలో చేరిన సిద్ధ రాఘవరావు కు ఎటువంటి హామీ జగన్ ఇవ్వలేదు. ముందు పార్టీ కోసం కష్టపడితే, ఆ తర్వాత పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పి జగన్ తప్పించుకున్నారు.
అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన కారణం బలరాం విషయంలోనూ జగన్ ఇదే వైకిరితో ఉన్నారు. కారణం తన కుమారుడు కర్ణం వెంకటేష్ కు నియోజక వర్గ ఇంచార్జి పదవి అప్పగించాలని కోరుతున్నా, జగన్ నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్టు తెలుస్తోంది. వీరే కాదు జగన్ తమకు ఏదో చేసేస్తాడు అని ఆశలు పెట్టుకుని చేరిన వారందరికీ ఇప్పుడు జగన్ వైకిరి అర్ధం కాక, ఆ పార్టీ నుంచి బయటకి వెళ్లలేక, ఉండలేక సతమతం అయిపోతున్నారట. జగన్ కరుణ ఎప్పుడు తమ మీద కలుగుతుందో అని వీరంతా ఎదురుచూపులు చూస్తున్నారట.