
ఈ మధ్యకాలంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏకంగా ప్రాణాలు తీస్తున్నాయి. ప్రేమ విఫలమైందని టీచర్ తిట్టిందని ఇలా చిన్నచిన్న కారణాలకే ఏకంగా బలవన్మరణాలకు పాల్పడి ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు రోజుకు చాలానే తెరమీదికి వస్తుండగా తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. తన ప్రేమ విఫలమైందని మనస్థాపంతో ప్రియురాలికి టిక్ టాక్ వీడియో పెట్టి ఆపై పది నిమిషాల వ్యవధిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఒక యువకుడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది ఈ విషాద ఘటన.
వివరాల్లోకి వెళితే.. తిమ్మ పల్లికి చెందిన గుర్రాల సాయవ్వ, నారాయణ దంపతులు కొన్నాళ్ల క్రితం కామారెడ్డి కి వచ్చి నివాసం ఉంటున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నారాయణ కొన్నేళ్ళ క్రితమే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా వీరికి ముగ్గురు పిల్లలు ఉండగా భార్య సాయయ్య బీడీలు చుడుతూ ఆ ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. చిన్న కుమారుడు సంతోష్ తన ఇద్దరు అన్నల తో కలిసి హైదరాబాదులో పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు . ఇక అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో... సంతోష్ ఓ యువతి తో ప్రేమలో పడ్డాడు.
హైదరాబాదు డ్రైవింగ్ చేస్తూ ఉండే సంతోషి ఓ యువతి తో ప్రేమలో పడటం... ఈ విషయం ఆ యువతి తల్లిదండ్రులకు తెలియడం జరిగిపోయింది. ఆ తర్వాత ఆ యువతి తల్లిదండ్రులు సంతోష్ ని మందలించారు. తమ కూతురిని హైదరాబాద్ నుంచి వరంగల్ కు తీసుకెళ్లిపోయారు. ప్రియురాలు దూరమవడంతో బాధను తట్టుకోలేక పోయాడు సంతోషం. ఎంతగానో కుంగిపోయిన సంతోష్ తన ప్రియురాలికి ఫోన్ చేస్తూ,.. ఎంతో మనస్తాపం చెందాడు. ఇక ఇంతకీ తన ప్రియురాలి తిరిగి రాదు అని భావించిన సంతోష్.. ఎడబాటును భరించలేనని టిక్ టాక్ వీడియో చేశాడు. ఈ వీడియోని ప్రియురాలికి పంపి ఆపై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.