ప్రస్తుతం భారత సైన్యం కాశ్మీర్ విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న విషయం తెలిసిందే. వరుసగా ఉగ్రవాదుల అందరిని మట్టుబెడుతూ తమ సత్తా చాటుతోంది. ఉగ్రవాదులు లేని కాశ్మీర్ గా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అదే సమయంలో అటు కాశ్మీర్ నుంచి వరుసగా ఉగ్రవాదులు భారత్ లోకి అడుగుపెడుతున్న వారిని భారత సైన్యం వారిని మట్టుబె lడుతూ ఉండటం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం కాశ్మీర్ సైన్యాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఎంతో వ్యూహత్మకంగా ఉండి. అదే సమయంలో ప్రస్తుతం పాకిస్తాన్ లోని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి ఎంతో మంది ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడుతూ ఆర్టీలరి గన్స్ తో మట్టుబెట్టిస్తుంది భారత సైన్యం. ఇప్పటికి ఎంతో మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టిన విషయం తెలుసిందే. ఇక తాజాగా సైన్యానికి లష్కరే తోయిబా ఉగ్రవాదులు ప్రాణాలతో ప్రాణాలతో పట్టుబడ్డారు. అయితే వీరు ఒకప్పుడు పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ పూర్తిగా ట్రైనింగ్ అయి వచ్చి ప్రస్తుతం కాశ్మీర్ లోకి వచ్చి స్థిరపడ్డారు. అయితే ప్రస్తుతం ఉన్న సందర్భంలో వెనకనుంచి వెన్నుపోటు పొడవడానికి సిద్ధమవుతున్న వీరిని ప్రస్తుతం సైన్యం ప్రాణాలతో పట్టుకున్నారు.
అయితే ప్రస్తుతం టెలీకమ్యూనికేషన్స్ మీద నిఘా ఉండటం.. వీరి కోడ్ కాంటాక్ట్స్ ఐడెంటిఫై చేసి నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల ప్రాణాలతో పట్టుకుంది సైన్యం. ఇది చాలా పెద్ద విషయం అని అంటున్నారు విశ్లేషకులు. అయితే మామూలుగా అయితే చనిపోతే ఎలాంటి సమాచారం మాత్రం అందుదు. కానీ ప్రస్తుతం ప్రాణాలతో నలుగురు ఉగ్రవాదులు దొరకడంతో వాళ్లు ఏ ఉద్దేశంతో భారత్ లోకి వచ్చారు... ఎక్కడ ట్రైనింగ్ అయి వచ్చారు ఉగ్రవాదుల శిఖరాలు ఎక్కడ ఉన్నాయి అనే ఎన్నో కీలక విషయాలు కూడా తెలియనున్నాయి . ఇక వారి నుంచి సేకరించిన వివరాలన్నింటినీ ప్రపంచ దేశాలకు చూపిస్తుంది భారత్, అంతే కాకుండా మిగతా ఉగ్రవాదులకు కూడా వీరు ఎక్కడ అన్ని విషయాలు బయటపెడతా అని భయం కూడా ఉంటుంది.