వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గడచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ తన పాదయాత్ర లో ప్రజల కష్టాలను నేరుగా చూసారు. అన్ని సమస్యలను రాసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో శిథిలావస్థకు చేరుతున్న అంగన్ వాడీ కేంద్రాల అభివృద్ధి కి శ్రీకారం చుట్టారు. "నాడు-నేడు" కార్యక్రమం పేరుతో వాటిని అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు.
అంగన్ వాడీ కేంద్రాలు ఇక మీదట చక్కటి వాతావరణం ఉండేలా, చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఆట స్థలం, గర్భిణులు, బాలింతలకు వైద్య తనిఖీలు చేసేందుకు ప్రత్యేక గదులు ఉండేలా అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో కనీస మౌలిక వసతులు లేని 977 అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించారు. వీటిని అభివృద్ధి పరచేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. సిగిన్నారులకు , బాలింతలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సదుపాయాలతో వీటిని తీర్చదిద్దనున్నారు. ప్రధానంగా ప్రీ స్కూల్‌ను దృష్టిలో ఉంచుకొని వరండా, ఆటస్ధలం ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక శిక్షణ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేంద్రాల్లో నాలుగు గదులను నిర్మిస్తారు.
హాల్, న్యూట్రిషన్ రూమ్, కిచెన్ రూమ్, ఒక స్టోర్ రూమ్‌లుగా వీటిని వినియోగిస్తారు. వీటి అభివృద్ధి కోసం మొత్తం రూ.73.27 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పనులు జరగనున్నాయి. ప్రతి కేంద్రం అభివృద్ధికి రూ.7.50 లక్షలు మంజూరు చేశారు. అయితే ఇప్పయికే దీనికి సంబంధించిన అన్ని అనుమతులు వచ్చేసాయి. త్వరలోనే పనులు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. త్వరలోనే పనులెజ్ మొదలు పెడతారని సమాచారం. ఇదే త్వరగా పూర్తయితే అంగన్ వాడీ కేంద్రాలకు మంచి రోజులు వచ్చినట్టే..