
దేశంలో ఇప్పుడు కరోనాతో ప్రజలు నానా కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు.. పాకిస్థాన్ నుంచి మిడతల దండు మన దేశంపై దండెత్తి వచ్చిన విషయం తెలిసిందే. వేలెడంత కూడా లేని మిడతలు వివిధ దేశాల్లోని లక్షల ఎకరాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. కోట్లమంది ఆహార భద్రతకు పెనుముప్పు కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో మిడతల దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇటీవల తెలుగు రాష్ట్రాలపై కూడా దండెత్తి వచ్చిన విషయం తెలిసిందే.
పంటలను నాశనం చేసే ఎడారి మిడతల దండు దేశ రాజధాని ఢిల్లీకి పక్కనే ఉన్న గుర్గావ్‌కు చేరుకుంది. గుర్గావ్‌లోని సైబర్ హబ్ ప్రాంతంలో వేలాది మిడతలు ఆకాశాన్ని కప్పేసిన వీడియోలు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. గుర్గావ్‌లోని పలు ప్రాంతాల్లో విస్తరించిన మిడతలు.. కొన్ని రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లనూ కవర్ చేశాయి. అక్కడి బిల్డింగ్‌ల్లో ఉంటున్న కొందరు ప్రజలు మిడతలు దండు వ్యాపించి ఉన్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
మరోపక్క, అధికారులు రాజధాని ప్రజలను అప్రమత్తం చేశారు. ఇళ్ల తలుపులు, కిటికీలు మూసివేయాలని, పెద్దగా చప్పుడు చేయాలని సూచించారు. ఇవి క్రమంగా ఢిల్లీ వైపు పయనిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ముందుజాగ్రత్తగా, ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు పైలెట్లకు మిడతల కదలికలపై అవగాహన కల్పించారు. మిడతల దాడిని ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలని గత నెలలో హర్యానా చీఫ్ సెక్రటరీ కేశిని ఆనంద్ అరోరా అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్‌కు ఆదేశించారు.
It's here in #Gurgaon .. #locust #LocustsAttack pic.twitter.com/UxCKj3hc0P
— sdas (@sumitdos) June 27, 2020