దేశంలోని రాజకీయాల్లో తమిళనాడు రాజకీయం ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ రాష్ట్రంలో కొన్ని సెంటిమెంట్లు నిజమవుతూ ఉంటాయి. రెండు పార్టీల చేతిలోనే అధికారం మారుతూ ఉంటుంది. తమిళనాడులో పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్నా సానుకూల ఫలితాలు వస్తాయో లేదో చెప్పలేం. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇదే సమయంలో శశికళ విడుదల కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. 
 
చిన్నమ్మ పేరుతో ఖ్యాతి సంపాదించిన శశికళ సుదీర్ఘ కాలంపాటు తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. కొన్ని కారణాల వల్ల అరెస్ట్ అయిన ఆమె ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతున్నారంటూ బీజేపీకి చెందిన ఒక నాయకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో శశికళ విడుదలైతే తమిళ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా....? అనే చర్చ జరుగుతోంది. 
 
ప్రస్తుతం స్టాలిన్ కు ప్రత్యామ్నాయంగా అన్నాడీఎంకే ఉందా..? లేదా....? అనే ప్రశ్నకు సమాధానం తేలాల్సి ఉంది. పళనిస్వామి, పన్నీరుసెల్వంల బృందం తమిళ రాజకీయాల్లో బాగానే పని చేస్తోంది. కరోనా విజృంభించిన తరుణంలో కూడా ఈ బృందం చక్కగా పరిపాలన సాగించింది. భారత్ లో అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు ముందువరసలో ఉంది. అయితే వీరికి ప్రజల్లో మాస్ ఇమేజ్ లేదు. 
 
శశికళకు కూడా మాస్ ఇమేజ్ ఉన్నా నమోదైన కేసులు ఆమెకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి. జయలలిత, కరుణానిధిపై కేసులు నమోదైనా జైలుశిక్షలు పడలేదు. ఎన్నికలకు ముందు శశికళ విడుదలవుతూ ఉండటంతో ఆమె మరొక పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తారా....? లేదా....? చూడాల్సి ఉంది. మరోవైపు రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుండటంతో తమిళ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాల్సి ఉంది.        

మరింత సమాచారం తెలుసుకోండి: