బిజెపి, జనసేన రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. 2024 లో అధికారం సాధించడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు ముందుకు వెళుతున్నాయి. దీనిలో భాగంగానే అనేక ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ ప్రజల్లో పలుకుబడి పెంచుకుని వచ్చే ఎన్నికల నాటికి టిడిపి, వైసీపీ లకు ధీటుగా ఎదగాలని బీజేపీ, జనసేన పార్టీలు ప్లాన్ చేసుకుంటున్నాయి. కానీ వైసిపి అధినేత జగన్ మాత్రం వారు ఎవరికీ అవకాశం దక్కకుండా, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ, అన్ని వర్గాలు,  అన్ని మతాల ప్రజలకు దగ్గరవుతూ ముందుకు వెళ్తున్న తీరుతో జనసేన, బిజెపి పార్టీలో కలవరం మొదలైనట్టు గా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కాపు నేస్తం పేరుతో అర్హులైన కాపు మహిళలకు వారి బ్యాంక్ అకౌంట్లో నేరుగా 15 వేల రూపాయలు ప్రభుత్వం జమ చేసింది.

 


 దీంతో ఒక్కసారిగా కాపులు జగన్ కు దగ్గరవుతారనే ఉద్దేశంతో వెంటనే రంగంలోకి దిగిన పవన్ ఏపీ ప్రభుత్వం పై అనేక విమర్శలు చేస్తున్నారనే విషయం ఇప్పుడు జనాల్లో చర్చకు వస్తోంది.  కాపు రిజర్వేషన్ అంశాన్ని కూడా మరోసారి తెరమీదకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు పెద్దఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. వాస్తవంగా చెప్పుకుంటే కాపు రిజర్వేషన్ ఇస్తానని ఇప్పటి వరకు జగన్ ప్రకటించలేదు. ఎన్నికలకు ముందు కూడా కాపులకు అడ్డాగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా.. 

 

కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని జగన్ తేల్చి చెప్పేశారు. చంద్రబాబు వలె ఇస్తానని చెప్పి మోసం చేయాలేను అని, ఇది తమ పరిధిలోది కాదని, కేంద్రం చేతిలో ఉంటుందని, ఒకవేళ కేంద్రం ఇస్తానంటే తమకు అభ్యంతరం లేదంటూ జగన్ క్లారిటీ గా చెప్పారు. అయినా ఇప్పుడు ప్రజల్లో వైసిపి ని ప్రజల్లో పలుచన చేసే విధంగా జనసేన నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ మహారాష్ట్రలో మరాఠీ లకు రిజర్వేషన్లు ఏ విధంగా ఇచ్చారని, అదేవిధంగా ఏపీలో కాపులు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాపులకు న్యాయం చేసేది జనసేన, బీజేపీ మాత్రమేనని, 2024లో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఇస్తామంటూ బిజెపి తరఫున జనసేన పార్టీ ప్రకటన చేస్తున్నా, ఇప్పటి వరకు ఏపీ బిజెపి నాయకులు ఈ వ్యవహారంపై స్పందించలేదు. అసలు ఈ రిజర్వేషన్ల అంశంలో తల దూర్చేందుకు బిజెపి ఇష్టపడడం లేదు. అయినా ఇప్పుడు పవన్ కాపు రిజర్వేషన్ అంశంలో కి బిజెపిని లాగుతుండగా పై ఏపీ బీజేపీ నేతలు జనసేన పై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: