ఈ మధ్య కాలంలో పట్టణాల నుంచి పల్లెల వరకు ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. టిన్స్, వాటర్ బాటిల్స్ లలో ఉండే మినరల్ వాటర్ తాగితే రోగాల భారీన పడమని బలంగా విశ్వసిస్తున్నారు. గతంలో బావులు, వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా జరిగేది. రానురాను జనం మినరల్ వాటర్ కు అలవాటు పడ్డారు. ఒకరిని చూసి ఒకరు ఈ వాటర్ తాగడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
అయితే మినరల్ వాటర్ తాగేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మినరల్ వాటర్ ఆరోగ్యానికి మంచిది కాదని... ఈ వాటర్‌లో మినరల్స్ ఉండకపోవడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వాళ్లు చెబుతున్నారు. వీటిని తాగడం వల్ల కిడ్నీ సమస్యలు ఎదురవుతాయని.... కిడ్నీల్లో రాళ్లు వస్తాయని .... నీళ్లు తాగడం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఈ నీటిని తాగేవాళ్లలో తక్కువ వయసులోనే మోకాళ్ల నొప్పులు వస్తాయని..... శరీరానికి అవసరమైన కాల్షియం, సోడియం, పాస్పరస్, సల్ఫర్, మెగ్నీషియం వంటి మినరల్స్ వంటివి మినరల్ వాటర్ లో ఉండవని వాళ్లు చెబుతున్నారు. కాచి చల్లార్చి రాగి పాత్రల్లో కానీ, కుండలో పోసి మంచినీటిని తాగితే ప్రయోజనం ఉంటుందని... కుండలో మంచినీటిని పోసి తాగితే ఎముకలకి అందాల్సిన కాల్షియం సరిగ్గా అందుతుందని సూచిస్తున్నారు.
మనలో చాలామంది నీళ్లు ఎక్కువగా తాగరని.... నీళ్లు ఎక్కువగా తాగితే దీని వల్ల భవిష్యత్‌లో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాళ్లు చెబుతున్నారు. నీళ్లు ఎక్కువగా తాగితే జీర్ణ సమస్యలు, మలబద్ధకం, అధిక బరువు వంటి సమస్యలు దూరమవుతాయి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం మెరుస్తూ తాజాగా మారడంతో పాటు జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మినరల్ వాటర్ కంటే మంచినీటినే తాగితే మంచిదని చెబుతున్నారు.