కరోనా వచ్చినప్పటి నుంచి మనిషికి కంటిమీద కునుకు లేకుండా పోతుంది. భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 18,653 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 507 మంది మరణించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,85,493కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 17,400కి పెరిగింది. 2,20,114 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,47,979 మంది కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా మహమ్మారి జీవితాల్ని నాశనం చేస్తోంది.
ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలచి వేస్తోంది. కొడుక్కి కరోనా సోకగా గుండెపోటుతో తండ్రి మరణించగా, కుమారుడు సైతం ఆయన్నే అనుసరించాడు. కరోనా వైరస్ సోకిన వారు మాత్రమే మరణిస్తారు అనుకోవటం పొరపాటు. ఈ విషాద సంఘటన అక్కడి ప్రాంత ప్రజలను కన్నీరు పెట్టిస్తుంది. చిత్తూరు జిల్లా నగరి మండలం ఏకాంబరకుప్పంలో జరిగిన ఈ ఘటన విషయం తెలిసిన ప్రతి ఒక్కరిని బాధపడేలా చేస్తుంది.
ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. తిరిగి వస్తాను అనుకున్న దైర్యంతో అతను ఆసుపత్రికి వెళ్లాడు. కానీ కరోనాపై నెలకొన్న భయాలతో ఆ వ్యక్తి తండ్రి అయిన 68ఏళ్ల వృద్ధుడు మనోవేధనతో గుండె పోటుతో మరణించాడు. కరోనాతో మరణించిన వారిని కొన్ని చోట్ల దారుణంగా పూడ్చిపెడుతున్న విషయం తెలిసిందే. కరోనా వల్ల చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో అనాధలుగా మిగులుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది.