చాలా మందికి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం బాగా అలవాటు. అయితే తరచూ ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే ఉప్పు తీసుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఒకటి రెండూ కాదు చాలా ఉన్నాయి. చాలా మందికి కూరల్లో ఉప్పు ఎక్కువగా వేసుకోవడమే అలవాటు. ఉప్పు తక్కువ ఉంటే బాలేదని, నచ్చలేదని అంటారు. కానీ ఉప్పు తక్కువ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట. రోజూ తీసుకునే ఆహారంలో ఎంత ఉప్పు తగ్గిస్తే అంత మంచిది. అంత ఆరోగ్యం మనకి కలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పుని తగ్గిస్తూ ఉండండి. లేకపోతే ఆరోగ్యాన్ని ప్రమాదం ఉంది.
అయితే తాజాగా జరిగిన సర్వేలో ఏం తేలిందంటే ఉప్పు లేదా సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆయుష్షు కూడా తగ్గుతుందిట. అయితే మన శరీరంలో ఎంత ఉప్పు ఉండాలి అన్న విషయానికి వస్తే దక్షిణాది వంటకాల్లో ఉప్పు వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. అయితే రోజులో కనీసం ఐదు గ్రాముల వరకు తీసుకోవచ్చు కానీ మన భారతీయులు రోజుకి 11 గ్రాములు ఉప్పుని తీసుకుంటారట.
అయితే ఉప్పు వల్ల కలిగే అనర్థాలు కూడా చూడండి. ఆహారం ద్వారా వెళ్లే ఉప్పులోని సోడియం రక్తంలో కలిసి మూత్ర ఉత్పత్తి పెరుగుతుంది. అయితే దీని కారణంగా రక్తం పరిమాణం పెరిగి మూత్రం ఉత్పత్తి కూడా ఎక్కువవుతుంది. దీనివల్ల మూత్రం ఎక్కువ సార్లు వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా మహిళలు వయసు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలో సోడియం స్థాయిని ఎక్కువగా ఉంటే రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. అలానే ఉప్పు తినడం తగ్గిస్తే రాత్రి లేచే అవకాశాలు గణనీయంగా తగ్గుతుందని తాజా పరిశోధనలో తేలింది. ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తం పరిణామం పెరిగి రక్తపోటు అధికమవుతుంది. అదే లో బీపీ ఉన్నవారు పగలు తీసుకునే ఆహారంలోనే కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకుని తినాలి రాత్రి పూట్ల తక్కువ ఉప్పు తినడం చాలా మంచిది.