ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు భారీగా కేసులు నమోదు అవుతుండడంతో ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్నగా  కరోనా  లక్షణాలు కనిపించినా స్వతహాగా వెళ్లి  పరీక్షలు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక చిన్న జ్వరం వచ్చినా కూడా ప్రస్తుతం ప్రాణ భయంతో వణికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో కరోనా  వైరస్ పరీక్షల విషయంలో కాస్త అవకతవకలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొంతమందికి వైరస్ లేకపోయినప్పటికీ పాజిటివ్ అని వస్తుండడం.. కొంతమందికి రిపోర్టులో విషయంలో గందరగోళం కొనసాగుతుండటం జరుగుతుంది. 

 

 ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలుచోట్ల ఇలాంటివి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే తూర్పుగోదావరి జిల్లాలో ఓ యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది, కరోనా  టెస్టులు అతని కన్ఫ్యూజన్లో పడేసాయి. వివరాల్లోకి వెళితే.. కాస్త జలుబు జ్వరం ఉంది అని కరోనా నేమో అని అనుమానపడి కాకినాడలో ఓ యువకుడు  టెస్టు చేయించుకున్నాడు. ఇక అతని రిపోర్టులు రానే వచ్చాయి ముందు ఆ యువకుడికి పాజిటివ్ వచ్చిందని కోవిడ్ కంట్రోల్ రూం నుంచి ఫోన్ వచ్చింది. 

 

 ఇక మళ్లీ కంట్రోల్ రూమ్  నుంచి ఫోన్ వచ్చి రిపోర్టులో కరోనా నెగిటివ్  అంటూ యువకుడికి షాకిచ్చారు అధికారులు. ఇక తనకు నెగిటివ్ వచ్చిందని ఆ యువకుడు కాస్త సంతోషపడేలోపే మరోసారి గుది బండలాంటి న్యూస్  చెప్పారు. మళ్లీ ఫోన్ చేసి ఆ యువకుడికి పాజిటివ్ వచ్చింది అంటూ షాక్ ఇచ్చారు వైద్య సిబ్బంది. దీంతో అతనికి పాజిటివా నెగిటివా  అని అర్థం కాక ఆ యువకుడు అయోమయంలో పడ్డాడు. చివరికి అతనికి పాసిటివ్  వచ్చిందని వైద్యులు నిర్ధారించారు అతన్ని  హోం ఐసోలేషన్ లో  ఉంచారు. అయితే కంప్యూటర్ పొరపాటు వల్ల ఇలా జరిగిందని కలెక్టర్ డి మురళీధర్రెడ్డి వివరణ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: