
ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబే అనుచరుడు అమర్ దూబేను పోలీసులు ఎన్కౌంటర్ చేసారు. ఈ రోజు ఉదయం హమీర్పూర్ జిల్లాలోని మౌదాహాలో జరిగిన ఎన్కౌంటర్ లో అతడిని మట్టు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. కాన్పూర్ లో 8మంది పోలీసులను హతమార్చిన వారిలో అమర్ దూబే కూడా ఉన్నాడు. అయితే ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు అతడిని మట్టుబెట్టినట్టు అధికారులు తెలిపారు. కాగా అమర్ దూబే తలపై రూ.25 నగదు ఉందని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఐజీ అమితాబ్ యశ్ తెలిపారు.
ఇక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రికార్డు ఉన్న వికాశ్ దూబే కోసం యూపీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. వికాశ్ దూబేపై ఉన్న రివార్డును 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ వెల్లడించారు. యూపీ మొత్తం అష్టదిగ్భందం చేశారు.. చెక్ పోస్టులు.. ఇతర ముఖ్య ప్రదేశాలు అన్నీ పోలీసులు కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. అంతే కాదు వికాశ్ దూబే అత్యంత సన్నిహితులను కూడా అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో దూబే గ్యాంగ్ లో ఉన్నవారిని ఎన్ కౌంటర్ చేయడం మొదలు పెట్టారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న ఓ హోటల్లో వికాశ్ దూబే కనిపించినట్లు తెలియడంతో హోటల్‌పై రెయిడ్‌కు వెళ్లిన పోలీసులు అక్కడ ఎన్కౌంటర్ జరిపారు. ఆ హోటల్లో ఉన్న ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.
వికాశ్ దూబే మాస్క్ వేసుకుని ఆ హోటల్‌కు వచ్చినట్లు సీసీటీవీ ఫూటేజ్‌లో తేల్చారు. యూపీ పోలీసు విభాగానికి చెందిన 25 దళాలు దూబే కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఇలా తన అనుచరులు ఒక్కొక్కరూ చనిపోయారు.. ఈ నేపథ్యంలో వికాశ్ దూబే కోర్టులో, లేదా టీవీ స్టూడియోలో లొంగిపోయేందుకు ప్రయత్నించగా కోర్టు కాంప్లెక్సుల్లో, టీవీ స్టూడియోల వద్ద పోలీసులను మోహరించడంతో ఎన్కౌంటర్ చేస్తారనే భయంతో అతను వెనుకంజ వేశాడని సమాచారం.
దూబే ప్రధాన అనుచరులు ముగ్గురు పోలీసుల కాల్పుల్లో మరణించారు. తాజాగా.. గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో దూబేను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇవాళ ఉదయం వికాస్ దూబే.. మహాకాల్ ఆలయంలోకి వెళ్లాడు.. ముందుగానే దర్శనం కోసం ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత నేను వికాస్ అంటూ వికాస్ దూబే గట్టిగా అరవడంతో.. అప్రమత్తమైన ఆలయ భద్రతా సిబ్బంది అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఎంత కరడుగట్టిన నేరస్తుడైనా చివరికి ప్రాణభయంతో పోలీసులకు ఇలా కావాలనే చిక్కినట్టు ఉందని నెటిజన్లు భావిస్తున్నారు.