చాలా మంది వాళ్ళ ముఖాన్ని అందంగా ఉంచుకోవడం కోసం అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ వాడతారు . కానీ వీటన్నిటి కంటే కూడా ముఖ్యమైనవి పండ్లు. వివిధ రకాల పండ్లు వల్ల బ్యూటీ  మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మీ చర్మం కాంతి వంతంగా అందంగా ఉండాలంటే ఈ టిప్స్ ని చూసి ఫాలో అయిపోండి.... దానిమ్మ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా ఇది గుండె పని తీరును మెరుగు పరచడం అలానే రోగ నిరోధక శక్తిని పెంచడం చేస్తుంది దానిమ్మ .

 

దానిమ్మ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. దానిమ్మ పండు స్కిన్ కి చేసే మేలు కూడా చాలా ఎక్కువ చర్మాన్ని మృదువుగా  చేసేస్తుంది. కాబట్టి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ చర్మం మీద ఉండే మచ్చల్ని పోగొడుతుంది. ఒక్క మాట లో చెప్పాలంటే క్లియర్ బ్యూటిఫుల్ స్కిన్ కోసం దానిమ్మ తో  సాధ్యం . క్లెన్సింగ్ కోసం మీరు దానిమ్మ గింజల తో చేసిన ఆయిల్ ని వాడాలి. దీనిలో ఫ్లేవనాయిడ్స్ ప్యునిసిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే దీనిలో నరిష్మెంట్ కూడా అయ్యే గుణాలు ఉన్నాయి కాబట్టి చర్మం కాంతివంతంగా మారిపోతుంది.

 

అలానే స్కిన్ టోనర్ గా కూడా దానిమ్మ ఉపయోగ పడుతుంది.  మేకప్ కానీ మిగిలిపోతే ఈజీగా తీసేయొచ్చు దానిమ్మ  వల్ల స్కిన్ హైడ్రేట్ అవ్వకుండా  కూడా ఉంటుంది. కనుక ఇలా  కూడా వాడొచ్చు . దానిమ్మ రసం తో మీరు ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల స్కిన్ డ్రైగా అవ్వకుండా ఉంటుంది. స్కిన్ నుంచి ఇంప్యూరిటీస్ తొలగించి బాగా సహాయ పడుతుంది. దీనిని  చాలా పల్చగా  అప్లై చేయాలి ఫలితాలు కూడా తక్షణమే కనపడతాయి.  ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా దానిమ్మకి సాటి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: