తాజాగా కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ యోజన స్కీమ్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మోడీ ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర క్యాబినెట్ లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఈ అంశాన్ని సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఈ అంశాన్ని అందరికీ తెలియజేశారు .ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ్ యోజన స్కీమ్ కిందట దాదాపు 21 కోట్ల మందికి పైగా ఉచితంగానే రేషన్ సరుకులు అందజేస్తుంది. ఇక తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు నవంబర్ వరకు ఈ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. రేషన్ కార్డు లేని వారు కూడా ఉచితంగానే రేషన్ పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం అందరికీ తెలియజేసింది. రేషన్ కార్డు లేకపోయినా ఏమీ కాదు కానీ ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. 

 

ఇక గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కిందట పింక్ కార్డ్, ఎల్లో కార్డ్ కు రేషన్ కార్డు కలిగిన వారికి ఒక్కో సభ్యులకు 5 కేజీల గోధుమలు లేదా బియ్యం, ఒక కేజీ కందిపప్పు ఉచితంగా వారికి అందచేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ ఎవరైనా ఉచిత రేషన్ పొందలేకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా కల్పించింది. 

 

ఏ సభ్యులు అయినా కానీ ఉచిత రేషన్ లభించలేదని వారి జిల్లా పౌరసరఫరాల అసిస్టెంట్ సెంటర్ కు  ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించింది. లేకపోతే 18001802087, 18002135512,1967 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు. ఇక చాలా రాష్ట్రాలు ఇందుకు సంబంధించిన ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఉచితంగా రేషన్ సరుకులు లబ్దిపొంద లేకపోతుంటే పై నెంబర్లకు ఫోన్ చేసే ఫిర్యాదు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: