2014లో కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మెప్పు పొందుతున్న సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మోదీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మోదీ తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీలాంటి అంశాలపై మొదట్లో ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా రానురాను ప్రజలు మోదీ తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఎంతో మేలు చేకూరుస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
2019లో రెండోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన మోదీ ఆర్టికల్ 370 లాంటి నిర్ణయాలతో ప్రజల మెప్పు పొందారు. అయితే ప్రస్తుతం భారత్ కరోనా వైరస్ విజృంభణ వల్ల విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోంది. మార్చి నెల తొలివారంలో దేశంలో పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా నేడు దేశంలో 20,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సైతం మోదీ ప్రభుత్వం వ్యాపార, వాణిజ్య పరంగా సంచలనం సృష్టించింది.
18 సంవత్సరాల తర్వాత తొలిసారి భారత్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. భారత్ జూన్ నెలలో నెలవారీ వాణిజ్య సర్ ప్లస్ ను చూసింది. 6,786 మిలియన్ల ఆదాయం అంచనా వేసుకునే స్థాయికి భారత్ ఎదిగింది. వాణిజ్య విభాగం అంచనా ప్రకారం వాణిజ్య మిగులు 6,786 మిలియన్లుగా ఉంది. ఇందులో దిగుమతులు 21.1 బిలియన్ డాలర్లు కాగా ఎగుమతులు 21.9 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం.
18 సంవత్సరాల తర్వాత భారత్ దిగుమతుల కంటే ఎగుమతులు పెరిగాయి. 2002 జనవరిలో భారత్ ఈ ఘనత సాధించగా మరోసారి దిగుమతుల కంటే ఎగుమతులు పెరిగి మరోసారి భారత్ ఈ ఘనత అందుకుంది. మందులు, మాస్కులు, ఇతర వైద్య పరికరాలను పెద్దఎత్తున ఎగుమతి చేయడం భారత్ కు ప్లస్ కాగా ప్రజల ఆదాయ వనరులు తక్కువ కావడంతో భారత్ అవసరమైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది.