ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి వద్దకు చేర్చాలనే లక్ష్యంతో వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 2,70,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. ప్రభుత్వం వీళ్లకు 5,000 రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తోంది. ప్రభుత్వం ఏపీలో పథకాల అమలు వాలంటీర్ల చేతుల మీదుగానే జరుగుతోంది. 
 
ప్రభుత్వం ప్రతి పథకం అమలుకు వీరి సేవలను వినియోగించుకుంటోంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ విషయంలో సైతం వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. సర్వేలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి సమాచారం అందజేస్తున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా  వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. 


మన రాష్ట్రంలో కొంతమంది ఈ వ్యవస్థపై విమర్శలు చేసినా ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం కలుగుతోంది. మన రాష్ట్రంలో కేరళతో పాటు పలు రాష్ట్రాలు వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టాయి. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో కరోనా నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభమైంది. వాలంటీర్లు కరోనా రోగుల వివరాలను, అనుమానితుల వివరాలను సేకరిస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. 
 
మన రాష్ట్రంలో ప్రారంభమైన వ్యవస్థ ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో సైతం ప్రారంభం కావడం గమనార్హం. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం తక్కువ సమయంలో లక్ష్యాలను సాధించే వీలు ఉంటుంది. అందువల్లే ఈ వ్యవస్థను మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాలు సైతం అందిపుచ్చుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి వద్దకు చేర్చాలనే లక్ష్యంతో వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 2,70,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. ప్రభుత్వం వీళ్లకు 5,000 రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తోంది. ప్రభుత్వం ఏపీలో పథకాల అమలు వాలంటీర్ల చేతుల మీదుగానే జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: