ఏ విషయంలోనూ ఎదురులేకుండా దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ కు ఇప్పుడు కాస్త బ్రేకులు పడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. సొంత పార్టీ నుంచి గెలిచిన వారే ఇప్పుడు ఇబ్బంది పెట్టే విధంగా తయారవ్వడం, వారి కారణంగా ఇప్పుడు మరికొన్ని వివాదాలు తెరపైకి రావడం వంటి పరిణామాలు జగన్ కు అసహనం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి గుర్తుగా ఆయన పేరు పై పార్టీ పెట్టిన జగన్ కు ఇప్పుడు అదే పేరు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో మరో పార్టీ ఉండడంతో , యువజన శ్రామిక రైతు పార్టీగా జగన్ పార్టీని స్థాపించి దానిని ఇప్పుడు అధికారంలోకి తీసుకు వచ్చారు. కానీ పూర్తి పేరుతో కాకుండా అందరూ పిలిచే పేరు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కొందరూ, మరికొందరు వైఎస్ఆర్ పార్టీ అంటూ పిలుస్తూ ఉంటారు. మరి కొందరు వైసిపి అని, ఇలా ఆ పేరును షార్ట్ చేసి ఇప్పటికీ పిలుస్తూనే ఉన్నారు.
ఇప్పుడు అదే ఇబ్బందికరంగా మారింది. గతంలో నందమూరి హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ పెట్టినట్లుగా జగన్ పార్టీ పెట్టక ముందే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కడప జిల్లాకు చెందిన భాషా అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించడం, ఇప్పుడు ఆ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ వేయడం వంటివి ఇప్పుడు ఏపీ అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అసలు పార్టీకి ఈ పేరు వివాదం రావడం వెనుక నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు కారణం. ఆయన పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, నోటీసులు అందించగా.. తనకు ఇచ్చిన నోటీసులు చెల్లవని, అసలు ఆ పార్టీ పేరుతో నాకు నోటీసు ఎలా ఇస్తారని ? మన పార్టీ వేరని, ఈ పార్టీ వేరు అని పెద్ద వివాదమే రేపారు.
ఈ వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గా చెప్పుకోవడానికి వీల్లేదంటూ, అన్నా వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు భాష చెబుతున్నాడు. ఇప్పటికే అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు పార్టీ పేరు కు సంబంధించిన వివాదం తలెత్తడంతో ఈ వ్యవహారం హై కోర్టు ఆదేశాలు ఏ విధంగా వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. వరుస వరుసగా ఇదే రకమైన తలనొప్ప కార్యక్రమాలు ఎదురవుతుండడంతో వైసీపీకి ఏం చేయాలో, ఎలా ఈ సమస్యల నుంచి భయటపడాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.