![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/kalyan-rao-do-suicide-at-bhuvanagiri-railway-station4f913b6b-61fb-4c71-ab40-b38afba6c8b7-415x250.jpg)
ఈ మద్య మానవ సంబంధాలు పూర్తిగా నాశనం అవుతున్నాయి. క్షణిక సుఖం కోసం కట్టుకున్న భర్తను భార్య.. భార్యను భర్త చంపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి.. నూరేళ్లూ కలిసి ఉంటామని ప్రమాణం చేసుకొని ఒక్కటైన జంట కేవలం నైతిక బంధం కారణంగా చంపుకుంటున్నారు. దాంతో ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మిగులుతున్నారు.. కొంత మంది అయితే తమ అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారని కన్న బిడ్డలనే హతమార్చుతున్నారు. ఇటీవల మేడ్చల్ జిల్లా పోచారంలో ఆద్య అనే చిన్నారి చేయని నేరానికి బలైన సంగతి తెలిసిందే. ఆద్య తల్లి ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం ఏర్పరచుకోగా, వారిలో ఓ యువకుడు ఆద్యను గొంతుకోసి చంపాడు.
ఈ దారుణమైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. వైవాహిక బంధాన్ని మంటగలిపి అక్రమ సంబంధం ఏర్పరుచుకున్న తల్లి అన్యాయంగా ఆ చిన్నారి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యింది. ఇదిలా ఉంటే ఆద్య తండ్రి కళ్యాన్ మనస్థాపంతో ఈ రోజులు ఆత్మహత్య చేసుకున్నాడు. బేబీ హత్య ఘటనతో మానసికంగా కృంగిపోయి తండ్రి సూరనేని కళ్యాణ్ రావు భువనగిరి రైల్వేస్టేషన్ దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కల్యాణ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం)లో పంచాయతీ కార్యదర్శిగా ప్రభుత్వోద్యోగం చేస్తున్నాడు. సదరు వివాహిత, కల్యాణ్ ప్రేమవివాహం చేసుకున్నారు.
వీరికాపురంలో ఫేస్ బుక్ స్నేహాలు చిచ్చు రేపాయి. సికింద్రాబాద్ కు చెందిన ఓ యువకుడితో వివాహిత అక్రమం సంబంధం ఏర్పరచుకుంది. అంతేకాదు, ఆ యువకుడు పరిచయం చేసిన మరో యువకుడితోనూ ఇదే తరహా సంబంధం పెట్టుకుంది. తమ అక్రమ సంబందానికి ఆ చిన్నారి అడ్డు వస్తుందని.. ఓ యువకుడు గొంతుకోసి చంపాడు. ఈ కేసు విషయంలో దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఆద్య తండ్రి కళ్యాన్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.