కరోనా గురించి రాష్ట్ర ప్రజల ఆందోళలను వినిపించడానికి కాంగ్రెస్ పార్టీ ఓ వేదికను ఏర్పాటు చేస్తోంది. 'స్పీకప్ తెలంగాణ' పేరుతో సోషల్ మీడియాలో ఆన్‌లైన్ ప్లాట్ ఫాం ను రెడీ చేస్తోంది. ఈ నెల 18న ఫేస్‌బుక్, , ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా ప్రజలు తమ ఆందోళనను వినిపించొచ్చని కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ... స్పీకప్ తెలంగాణ పేరుతో సోషల్ మీడియా వేదికగా ఆందోళన చేయాలని నిర్ణయించింది. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆన్ లైన్ సామాజిక మాద్యమాల్లో ఆందోళనకు పిలుపు నిచ్చింది.
ఈ మేరకు కరోనా మహమ్మారి, ఆరోగ్యం, విద్యా సమస్యలపై ఆన్‌లైన్ ద్వారా పీసీసీ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశమై చర్చించింది. వీడియో కాన్ఫరెన్స్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సోషల్ మీడియా ద్వారా స్పీకప్ తెలంగాణలో ప్రజల అభిప్రాయాలు చెప్పొచ్చని టీ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. మరోవైపు మహమ్మారిని ఎదుర్కోవడానికి పరిశీలనలు, సూచనలను, సలహాలతో సీఎంకు బహిరంగ లేఖ రాయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
రాష్ట్రంలోని పరిస్థితిని అంచనా వేసి మహమ్మారిని ఎదుర్కోవడానికి యాక్షన్ ప్లాన్ అవసరమని టీ కాంగ్రెస్ అంటోంది. ఇందుకోసం క్యాబినెట్ సమావేశమై భవిష్యత్ చర్యలపై నిర్ణయం తీసుకోవాల్సిఉండగా., సీఎం కనిపించకుండా పోయారని ఆరోపించారు.
రాష్ట్రంలో కొవిడ్‌ను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. స్పీకప్ తెలంగాణ పేరుతో జనం గళం వినిపిస్తామంటున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇది ఏకకాలంలో ప్రారంభమవుతుందని వారు చెబుతున్నారు.