ఏపీ సీఎం జగన్ ఒకేసారి ఇటు కేసీఆర్ కూ.. అటు కర్ణాటక సీఎం యడ్యూరప్పకూ షాక్ ఇచ్చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుండటంతో.. ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో నిబంధనలు మరింత కఠినం చేశారు. ఏకంగా ఈ రెండు రాష్ట్రాలకు హైరిస్కు ప్రాంతాలకు ప్రకటించారు. ఏపీలోనూ కరోనా విజృంభిస్తుండటంతో  ఆ రాష్ట్రం నిబంధనలు మార్చుకుంది.  


ఇప్పుడు ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రైళ్ల ద్వారా  వచ్చే వారిలో ర్యాండమ్‌గా టెస్టులు చేయాలి. వారికీ 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి. ఇక  రహదారి మార్గం ద్వారా ఏపీలోకి ప్రవేశించే చోట బోర్డర్ చెక్ పోస్టుల వద్దే స్వాబ్ టెస్టులు చేస్తారు. తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికులకు 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి. 

 

IHG


ఏపీకి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా  ఇ-పాస్ కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాల్సిందే.   రాష్ట్ర సరిహద్దుల వద్ద కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను తక్షణం వేరు చేసి కొవిడ్ ఆస్పత్రులకు తరలిస్తారు. ఇక హోమ్ క్వారంటైన్ చేసిన వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు వలంటీర్, సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటారు.   


ఇక  తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హై రిస్క్‌ ప్రాంతాలుగా వర్గీకరిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో తెలంగాణ, కర్ణాటకను లోరిస్క్‌ ప్రాంతాలుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు అక్కడ కేసుల సంఖ్య తీవ్రస్థాయికి చేరటంతో హై రిస్క్‌ ప్రాంతాలుగా మార్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: