మార్చి నెల తొలి వారం నుంచి దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. పలు దేశాల్లో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తున్నా భారత్ లో మాత్రం వైరస్ ఉధృతి కొనసాగుతోంది. అయితే వైరస్ గురించి వెలుగులోకి వస్తున్న పలు విషయాలు ప్రజల్లో భయాందోళనను మరింత పెంచుతున్నాయి. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా వైరస్ లేదని సంతోషపడవద్దని కొంతమందికి కరోనా సోకినా యాంటీజెన్, ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ నిర్ధారణ అవుతోందని వైద్యులు చెబుతున్నారు. 
 
సాధారణంగా కరోనా పరీక్షల ఫలితాలను బట్టే తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా రోగులకు చికిత్స జరుగుతోంది. యాంటీజెన్ పరీక్షల్లో పాజిటివ్ వస్తే పాజిటివ్ గా నిర్ధారించాలని నెగిటివ్ వస్తే ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే తాజాగా ఆర్టీ పీసీఆర్ పరీక్షలో కూడా కచ్చితమైన ఫలితాలు వెలువడటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా మంది కరోనా నెగిటివ్ వస్తే సీజనల్ వ్యాధులు అయి ఉండవచ్చని భావిస్తున్నారు. 
 
అయితే పరిస్థితి విషమించిన వారికి సిటీ స్కాన్ చేస్తే కరోనా సోకినట్లు నిర్ధారణ అవుతోంది. వైద్యులు కరోనా నెగిటివ్ వచ్చినా లక్షణాలు కనిపిస్తే మరింత లోతుగా పరీక్షలు చేయించుకోవాలని సూచనలు చేస్తున్నారు. వీలైతే ఆక్సిజన్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని 94 శాతం కంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే ప్రమాదమని చెబుతున్నారు. సాధారణంగా వైరస్ సోకిన వాళ్లలో 7 రోజుల వరకు యాంటీబాడీస్ ఉండవు. 
 
వైరస్ నిర్ధారణ అయితే ఇమ్యునోగ్లోబునిల్స్ ఎం(ఐజీఎం), ఇమ్యునోగ్లోబునిల్స్ జీ(ఐజీజీ) శరీరంలో తయారవుతాయి. వైరస్ లక్షణాలు కనిపిస్తున్నా ఆర్టీ పీసీఆర్ పరీక్షలో నెగిటివ్ నిర్ధారణ అవుతుంటే ఐజీఎం, ఐజీజీ పరీక్షలు చేయించుకోవడం మంచిది. కొందరు వైద్యులు కరోనా కొత్త వ్యాధి కాబట్టి పరీక్షలు చేసే సిబ్బందికి తగినంత నైపుణ్యం కూడా అవసరం అని ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో 60 నుంచి 70 శాతం మాత్రమే కచ్చితత్వం ఉంటుందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: