ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయి ఆరేళ్లు దాటిపోయింది. కానీ.. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదే.. అవును వింటే కాస్త బాధగానే ఉంటుంది కానీ.. ఇదే చేదు నిజం.. వాస్తవానికి 2024 వరకూ హైదరాబాద్ అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండింటికీ ఉమ్మడి రాజధానే.. ఏపీ ఏర్పడిన ఆరేళ్ల తర్వాత కూడా పరిస్థితిలో ఏమీ  పెద్దగా మార్పు కనిపించడం లేదనే చెప్పాలి. 

 


ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా.. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడుగా పని చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు స్థిర నివాసం హైదరాబాదే. ఆయన కుమారుడు, ఏపీ శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ స్థిర నివాసం కూడా హైదరాబాదే. ఏపీ శాసన మండలి లో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్థిర నివాసం హైదరాబాదే.. ఇక సీఎం జగన్ ప్రస్తుతానికి…అవసరం రీత్యా తాడేపల్లిలో ఉంటున్నప్పటికీ…ఆయన శాశ్వత నివాస గృహం కూడా హైదరాబాదే.

 

IHG

జనసేనాని పవన్ కల్యాణ్, సినీపరిశ్రమ పెద్దలు అంతా ఉండేది ఉంటున్నది హైదరాబాద్‌లోనే.. అంతేనా.. ఏపీలో పని చేస్తున్న ఐ ఏ ఎస్; ఐ పీ ఎస్ అధికారుల్లో అత్యధిక శాతం వారి స్వంత నివాస గృహాలు హైదరాబాద్ లోనే.  ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో అత్యధిక భాగం వారి కొంపా గూడూ హైదరాబాదే. మంత్రులూ, లేజిస్లేచర్ లో అధిక సంఖ్యాకుల స్థిర నివాసాలు హైదరాబాదే. 

 

 

కేవలం నాయకులు, అధికారులు మాత్రమేనా.. 13 జిల్లాలకు చెందిన వారిలో దాదాపు ప్రతి కుటుంబానికో... లేక ప్రతి రెండు, మూడు కుటుంబాలకో.. ఒకరు లేక ఇద్దరి తల రాతలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాదే. అందుకే.. ఏపీ రాజధాని ఇప్పటికీ హైదరాబాదే..! కాదంటారా..? 

మరింత సమాచారం తెలుసుకోండి: