
ఇపుడు యావత్ దేశంలోనే హాట్ టాపిక్ ఏమిటంటే, కేరళ గోల్డ్ స్కామ్ కేసు. ఈ కేసుకి సంబంధించి రోజుకో అప్ డేట్, ట్విస్ట్ తెర పైకి వస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ కేసులో ప్రధాన నిందితులైన సందీప్ నాయర్, స్వప్నా సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిని జాతీయ దర్యాప్తు సంస్థ అయిన NIA వీరిని విచారిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి, హైదరాబాద్‌తో లింకులు ఉన్నట్లు కస్టమ్స్ విభాగం గుర్తించినట్లు సమాచారం.
ట్విస్ట్ ఏమంటే... ఈ కేసులో మనీ లావాదేవీలన్నీ హైదరాబాద్ నుండే జరిగినట్లు అధికారులు గుర్తించారు. విషయం ఏమిటంటే.. ఈ రకమైన కేసుల్లో చెల్లింపులన్నీ హవాలా రూపంలోనే జరుగుతాయని, అందువల్ల దీనికి సంబంధించి, హైదరాబాద్‌కు చెందిన కొంతమంది బడా వ్యాపారుల, రాజకీయనాయకుల హస్తం ఉండొచ్చనే దిశగా కేసు మలుపులు తిరుగుతోంది. అసలు నిజా నిజాలు బయటపడితే చాలా మంది జాతకాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.
జులై 6న తిరువనంతపురం విమానాశ్రయంలో, దుబాయ్ నుండి వచ్చిన ఓ చార్టర్డ్ విమానంలో సుమారు 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అడ్డ దారిలో తీసుకొచ్చిన రూ. 15 కోట్ల విలువైన బంగారం విషయం దేశంలో పెను సంచలనమే సృష్టించింది. ఈ క్రమంలో కేరళలో uae కాన్సులేట్‌లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసి, విచారించగా కొన్ని షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
ఇందులో కొసమెరుపు ఏమిటంటే... ఈ కేసులో ఏకంగా సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో దేశంలో ఈ విషయం పెను కలకలం సృష్టించింది. ట్విస్ట్ ఏమంటే కేరళ సీఎం అతి సన్నిహితంగా మెలిగే, కేరళ IT, స్పేస్ పార్క్ మార్కెటింగ్ ఆఫీసర్ అయిన స్వప్న సురేష్ దీనికి ప్రధాన సూత్రధారి అని తేలడం. దాంతో NIA అధికారులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ ముమ్మురం చేస్తున్నారు.