కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత.. ఇక మళ్లీ రాదని అనుకోకండి.. మిగిలిన జబ్బులకు కరోనాకు అదే తేడా. కరోనా వచ్చి తగ్గిన తర్వాత మళ్లీ కరోనా రావొచ్చు. దీనికి కారణం.. కరోనాను తగ్గించే క్రమంలో శరీరంలో తయారయ్యే యాంటీ బాడీస్.. నెలరోజులకన్నా ఎక్కువ ఉండవట. ఈరోజుకి కరోనా నుంచి బయటపడినా.. ప్రమాదం పొంచి ఉన్నట్లే. 

 

కరోనా మహమ్మారి.. అంతుచిక్కడం లేదు. శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు. ఈ మహమ్మారి ప్రపంచాన్ని పీడించడం మొదలుపెట్టి.. ఆరు నెలలు దాటుతున్నా.. ఇంకా దానికి సంబంధించి ఎన్నో విషయాలు బయటకు రావడం లేదు. మామూలుగా ఏదైనా రోగం వచ్చి తగ్గిన తర్వాత.. దానికి సంబంధించిన యాంటీ బాడీస్.. శరీరంలో కొద్దిరోజులపాటు ఉంటాయి. మరోసారి వైరస్ అటాక్ చేసినప్పుడు.. ఈ యాంటీ బాడీస్.. ఆ వైరస్ పై పోరాడతాయి.  బాక్టీరియా, వైరస్ లాంటి సూక్ష్మ జీవులు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటితో పోరేడేందుకు రక్తంలోని తెల్లరక్తకణాలు యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తాయి. కరోనా వైరస్ సోకి తర్వాత ఆరోగ్యవంతుడిగా మారిన మనిషి రక్తంలో యాంటీ బాడీలు ఉంటాయి. అయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నాక కూడా.. మళ్లీ వైరస్ బారిన పడుతున్నారు. అందుకు కారణం.. యాంటీ బాడీస్ వచ్చినట్లే వచ్చి మాయమవుతున్నాయి. అవి ఎక్కువకాలం ఉండట్లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 

వాస్తవానికి మొదట్లో కరోనా విస్తరిస్తే అందరికి ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నారు. కానీ కరోనా అందరి అంచనాలను తలకిందులు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అంతెందుకు కరోనా వచ్చిన వాళ్ళకు 14 రోజుల్లో నయమైతే.. నెల తర్వాత మళ్ళీ కరోనా సోకిన కేసులూ ఉన్నాయి. దాంతో యాంటీ బాడీస్ పై చాలా అనుమానాలు ఉన్నాయి. 

 

ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్న వాళ్ళపై లండన్ లోని కింగ్స్ యూనివర్సిటీ పరిశోధనలు చేసింది. అయితే 90 మందిని పరిశీలించగా 16 శాతం మందిలో మాత్రమే మూడెు నెలల తర్వాత యాంటీ బాడీస్ కన్పించాయి. దీన్ని బట్టి యాంటీ బాడీస్ వచ్చుంటాయి అనే అపోహ వద్దంటున్నారు సైంటిస్టులు.  సో ఒక సారి వచ్చి వెళ్ళింది కాబట్టి.. కరోనా మళ్ళీ రాదని అనుకుంటే పొరపాటే. మళ్ళీ ఇన్పెక్షన్ సోకే ప్రమాదం లేక పోలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: