స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో మీరు ఎమన్నా లోన్  తీసుకున్నారా? అయితే మీకు ఒక  శుభవార్త  అందబోతోంది. స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ అందించింది. ఈ ఆఫర్  బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి మాత్రమే. అయితే ఇది అందరికీ వర్తించదు సుమా . కేవలం (ఎంసీఎల్ఆర్ ) మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్  రుణాలు తీసుకున్న వారికే ప్రయోజనం ఉంటుంది. (MCLR)ఎంసీఎల్ఆర్ లింక్డ్ హోమ్ లోన్, ఆటో లోన్ వంటి రుణాలు పొందిన వారికి మాత్రమే  కొంత ఊరట కలుగనుంది. ఇప్పుడు  ఏడాది ఎంసీఎల్ఆర్ కాకుండా ఆరు నెలల ఎంసీఎల్ఆర్ వ్యవస్థకు మారనున్నాయి.

 

 

 

స్టేట్ బ్యాంక్ 2019 ఏప్రిల్ నుంచి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను ఏకంగా 155 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. అయితే తాజా సర్వే లో ఇప్పటిదాకా  ఎస్‌బీఐ అందించిన రుణాల్లో దాదాపు 70 శాతం ఎంసీఎల్ఆర్‌ లింక్డ్ లోన్సే ఉన్నాయి. అయితే ఎకనమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కొత్తగా రుణం పొందే వారు ఇటీవలి వరుస రేట్ల కోత వల్ల ప్రయోజనం పొందుతున్నారని ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (ఫైనాన్స్) జె.స్వామి నాథన్ తెలిపారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి రుణ రేట్ల తగ్గింపు చోటు చేసుకుంటున్నా కూడా రుణ గ్రహీతలు (ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్ పొందిన వారు) రీసెట్ డేట్ వరకు వేచి చూడాల్సి వస్తోందని పేర్కొన్నారు.

 

 

 

అలా కస్టమర్స్ వేచిచూడకుండా  తమ బెంచ్‌మార్క్‌ను ఆరు నెలల ఎంసీఎల్ఆర్‌కు మార్చుకోవాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో ఎంసీఎల్ఆర్ రుణాలు పొందిన వారికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. సాధారణంగా ఎస్‌బీఐ కస్టమర్లకు రీసెట్ ఏడాదికి ఒకసారి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ బెంచ్ మార్కుని ఆరు నెలల  బెంచ్‌మార్క్‌గా తీసుకుంటే.. స్వల్ప కాలిక రుణాలు పొందిన వారు, లేదంటే ఫిక్స్‌డ్ రేటుతో లోన్ తీసుకున్న వారికి ఎలాంటి ప్రయోజనం కలుగదు. ఎంసీఎల్ఆర్ లింక్డ్ హోమ్ లోన్, ఆటో లోన్ వంటి రుణాలు పొందిన వారికి మాత్రమే ప్రయోజనం ఉంటుంది. అయితే   ప్రస్తుతం ఎస్‌బీఐ ఏడాది ఎంసీఎల్ఆర్  బెంచ్ మార్క్ అనేది  7 శాతంగా కొనసాగుతోంది.అదే   ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 6.95 శాతంగా ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే   కస్టమర్లు 6 నెలల ఎంసీఎల్ఆర్ ఎంచుకుంటే వెంటనే బెనిఫిట్స్ పొందవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: