భారత్ లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ సడలింపులకు ముందు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కాగా ప్రస్తుతం వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా వైరస్ ను నియంత్రించడంలో సక్సెస్ కాలేకపోతున్నారు. 
 
అయితే కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించడంలో కొన్ని మందులు అద్భుతంగా పని చేస్తున్నాయి. స్వీడన్ కంపెనీ ఎంజమైటికా తయారు చేసిన కోల్ద్ జైమ్ మందు కరోనా నియంత్రణలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మెడిసిన్ గొంతు, నోటిలో ఉండే 98.3 శాతం వైరస్ ను నిర్వీర్యం చేసిందని ప్రాథమిక పరిశోధనల్లో వైరస్ ను మెరుగ్గా నియంత్రిస్తున్నట్టు తేలిందని చెబుతున్నారు. 
 
ఎంజమైటికా కంపెనీ నిన్న పరిశోధనల ఫలితాలను ప్రకటించింది. ఒక యంత్రం సహాయంతో కోల్డ్ జైమ్ ను నోట్లో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందని కేవలం 20 నిమిషాల్లో వైరస్ నిర్వీర్యం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికన్ కంపెనీ మైక్రోబాక్ లేబొరేటరీస్ లో తాము పరిశోధనలు జరిపామని కోల్డ్ జైమ్ ఎటువంటి దుష్ప్రభావాలను చూపించలేదని చెప్పారు. 
 
ఈ స్ప్రేను ఉపయోగించడం ద్వారా వైరస్ మన శరీరంలోకి వెళ్లదు. మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్ లు నోట్లోనే నీరసించిపోతాయి. మరోవైపు ఆక్స్ ఫర్డ్ తొలి, రెండో దశ ట్రయల్స్ లో అద్భుత ఫలితాలు సాధించించింది. ఈ సంవత్సరం చివరినాటికి ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పలు వ్యాక్సిన్ లు మంచి ఫలితాలు సాధిస్తూ ఉండటంతో త్వరలో కరోనా వైరస్ ను కట్టడి చేయడం త్వరలోనే సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: