కరోనా  వైరస్ ప్రభావం అన్ని రంగాల పై తీవ్రస్థాయిలో పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విద్యారంగాన్ని ఈ మహమ్మారి కరోనా  వైరస్ అతలాకుతలం చేసింది. సరిగ్గా విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కరోనా వైరస్ విజృంభించడంతో... విద్యార్థుల  భవిష్యత్తు కి ఆటంకం ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో  విద్యాసంవత్సరం ప్రారంభం కోసం  జగన్ సర్కార్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. అటు పరీక్షలకు సిద్ధమవుతున్న వారే కాకుండా పై  తరగతులకు వెళ్లాల్సిన వారికి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

 


 ఇక కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య ఆంధ్రప్రదేశ్ లో  రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఆ తర్వాత ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య అది సాధ్యం కాదని భావించిన జగన్ సర్కార్... ఇంటర్మీడియట్ పరీక్షలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం యూజీ,  పీజీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో  రోజురోజుకు కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతూ అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో పరీక్షల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

 

 అయితే యూజీ, పీజీ పరీక్షలపై తాజాగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని  20 యూనివర్సిటీల పరిధిలో యూజీ పీజీ పరీక్షలను సెప్టెంబర్ లోపు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. అయితే కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య పరీక్షలకు హాజరు కాలేని వారికి మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు అంటూ ఆయన స్పష్టం చేశారు, అంతేకాకుండా 2020- 21 విద్యా సంవత్సరంలో కూడా కీలక మార్పులు చేస్తున్నామని.. సెప్టెంబర్ 13 నుంచి 27 లోపల ఎంసెట్ సహా మరికొన్ని ఎంట్రన్స్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: