కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించినప్పుడు కేవలం అత్యవసర సేవలు అందించే వారికి మాత్రమే మినహాయింపు ఇచ్చింది. అలాంటి వాటిలో ముఖ్యంగా పోలీసు విభాగానికి, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి అనుమతులు లభించాయి.. వీటితో పాటు మీడియా విభాగానికి కూడా అత్యవసర సర్వీసులు జాబితాలో పెట్టారు.. లాక్ డౌన్ నిర్వహిస్తున్న ఆ సమయంలో ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కరోనా సమయంలో మీడియా ప్రతినిధులు తమ సేవలను ఎంతో ధైర్యంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

 

ఇలాంటి ధైర్యసాహసాలతో కూడిన జర్నలిజం వృత్తిలో అనేక ప్రమాదాలు ఉన్నాయి. సోమవారం ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది.విక్రమ్ జోషి అనే జర్నలిస్ట్ పై కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. రాత్రి సమయంలో విచక్షణారహితంగా కొంతమంది దుండగులు జర్నలిస్ట్ పై తనతోపాటు ఉన్న తన కూతురి పై కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో .విక్రమ్ జోషి కి తల పై బుల్లెట్ తగిలింది. వెంటనే ఉన్నచోటనే కుప్పకూలిపోయాడు.దీంతో వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం ఘజియాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై వస్తున్న ఆయన ఒక్కసారిగా కొందరు గుండాలు చట్టుముట్టారు. అతి దగ్గర నుంచి అతనిపై కాల్పులు జరిపారు. అతని తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన కూతురు తండ్రి పక్కనే కూర్చుని సాయం కోసం ఏడవడం మొదలు పెట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన చిత్రాలు అన్ని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

 


అయితే కాల్పులకు పాల్పడింది కొందరు దుండగులు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్ట్ విక్రమ్ జోషి తన మేనకోడల్ని వేధిస్తున్న కొంతమంది దుండగుల పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో ఆ పోకిరీలే ఈ పని చేసారని విక్రమ్ జోషి సోదరుడు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జోషి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసినప్పటికి పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయలేదని ఆయన సోదరుడు ఆవేదన వ్యక్తం చేసారు. దీనిపై స్పందించిన ఎస్‌ఎస్పీ తమకు సమాచారం అందిందని కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: