గత కొన్ని రోజులుగా రాజస్థాన్ లో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. రాజస్థాన్ హైకోర్టులో సచిన పైలట్ వర్గానికి ఊరట లభించింది. పైలట్ సహా 18 మంది ఎమ్మెల్యేలపై ఈ నెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన అనర్హత పిటిషన్ కు వ్యతిరేకంగా పైలట్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మూడు రోజుల పాటు ఊరట కల్పించింది.
మరోవైపు మరికాసేపట్లో రాజస్థాన్ కేబినేట్ భేటీ కానుంది. హైకోర్టు తీర్పు వెలువడడంతో భవిష్యత్ కార్యాచరణపై కేబినెట్ లో చర్చ జరగనుంది. అంతకు ముందు అశోక్ గెహ్లాట్ సీఎల్పీ సమావేశం నిర్వహించారు. రెబల్ లీడర్ సచిన్ పైలట్ పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సచిన్ పైలట్ పనికిమాలినవాడైనా డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు పదవులు ఇచ్చి గౌరవించామని చెప్పారు. ఆరు నెలలుగా బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని కూల్చాలని సచిన్ పైలట్ ప్రయత్నిస్తున్నామని అన్నారు.
సచిన్ పైలట్ అమాయకంగా ముఖం పెడుతూ రాజకీయంగా కుట్ర పన్నాడని వ్యాఖ్యలు చేశారు. కాంరెస్ నేతలు సచిన్ పైలట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తమతో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ స్వేచ్ఛగా ఉన్నారని కానీ సచిన్ పైలట్ క్యాంపులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బంధీలుగా ఉన్నారని చెప్పారు. సచిన్ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు తమకు ఫోన్ చేసి వాళ్ల బాధలు చెప్పుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు.
వాళ్లలో చాలామంది వచ్చి తమతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సీఎం ఇప్పటికే బల నిరూపణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు ముఖ్యమంత్రి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పైలట్ వర్గం 35 కోట్లు ఇస్తామని చేసిన ఆరోపణలను పైలట్ ఖండించారు. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన వ్యాఖ్యలను విని తాను పెద్దగా ఆశ్చర్యపోలేదని చెప్పారు.